STORYMIRROR

goli archana

Others

4  

goli archana

Others

కోరిక

కోరిక

1 min
395

కోరిక


నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండాలని


ఆ కళ్ళల్లో నాపై ప్రేమ ని చూడాలని


నీ చెయ్యి పట్టుకుని నీ పక్కన ఉండిపోవాలని


నీ అడుగులో అడుగు వేస్తూ నీ వెంటే నడవాలని


నీ గుండెల్లో నాకంటూ ఒక స్థానం కావాలని


నన్ను చూడగానే నీ పెదాలపై చిన్న చిరునవ్వు చూడాలని


ప్రతిరోజు నీ గుండెలపై తల పెట్టుకుని నిద్దురపోవాలని


ప్రతిక్షణం నీ మాటలు వింటూ ఉండాలని


నీ వెచ్చని కౌగిలిలో కరిగిపోవాలని



నా కంటూ నేను లేకుండా మొత్తంగా నీతో కలిసి నువ్వే నేనుగా మారాలని


నా గుండె చప్పుడు నీతో కలిసి నా ఊపిరి గా నువ్ మారాలని


ప్రతిక్షణం నా కళ్ళు నిన్ను చూస్తూ ఉండాలని


నా మనసులో , జ్ఞాపకాలలో , నా ఎదురుగా నువ్వే ఉండాలని


నాలో ఉన్న అంతమైన ప్రేమ ని నీకే పంచాలని



బదులుగా కాస్తయిన నీ ప్రేమ ని నాపై కురిపించాలని



నాలో ఊపిరి ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూ ఉండాలని


మన ప్రేమ కి ప్రతిరూపాలుగా మన కుటుంబం నిండుగా సంపూర్ణం కావాలి అని


మన దాంపత్యం లో ఎలాంటి అరమరికలు .. హెచ్చుతగ్గులు .. పొరపచ్చాలు .. లేకుండా బోలెడంత ప్రేమ .. చిన్న చిన్న అలకలు .. గొడవలు .. బుజ్జగింపులతో హాయిగా సాగిపోవాలి అని



నిన్ను చూస్తూ నీ ఒడిలో చిరునవ్వు నవ్వుతూ నా తుది శ్వాశ వదలాలి అని నా కోరిక



Rate this content
Log in