నువ్వు లేని నేను
నువ్వు లేని నేను
నీతో వున్న ప్రతి క్షణం ఏదో
తెలియని ఆనందం
నీ చెలిమి నాకెన్నో నేర్పింది
నీ తోడు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది
నీ అడుగు నాకు దారిని చూపించింది
....
నువ్వూ వదిలే శ్వాస నాకు ఊపిరి అయ్యేది
నీ చూపు , నీ మాట ,నీ కదలిక అన్ని
నాకు నా గమ్యాన్ని చుపేవి
అది నువ్వే అని
....
ప్రతి క్షణం నీ ఆలోచనే
ప్రతి నిమిషం నీ ఊహలే
నువ్వూ లేని నేను ఎలా అనే ఆలోచనే లేకుండానే
ప్రతి క్షణం గడిపేసన్ను
....
నేను చేసిన తప్పు అదే ఏమో
ఇప్పుడు నువ్వే లేని నన్ను చూసుకోలేక
పోతున్న
ప్రతి క్షణం నీ తిరుగు రాకకై ఎదురు చూస్తున్నా
.....

