STORYMIRROR

siddu macharla

Tragedy Inspirational Others

4  

siddu macharla

Tragedy Inspirational Others

నువ్వు లేని లోకం

నువ్వు లేని లోకం

1 min
16

నిదురించే రాత్రిలో
నీ పిలుపు వినిపించిందని అనుకున్నా…
కానీ అది నా గుండె మధ్య
పగిలిపోయిన జ్ఞాపకం మాత్రమే.

చేయి పట్టుకునే వయసులో
చేయి వదిలేసి వెళ్లిపోయావు,
నేను ఆలోచించిన ప్రతి కలలో
నువ్వే మాత్రం మిగిలిపోయావు.

నవ్వమని నేర్పించే ముందే
ఏడవడం ఎలా అని నేర్చుకున్నా,
బ్రతకడం అంటే నీ పేరు పిలవడం అని
నా జీవితం చెప్పింది.

ఇంట్లో దీపం వెలిగినపుడు
నీ నీడ కనిపిస్తుంది,
కానీ నేను తిరిగి చూసేసరికి
ఆ నీడ కూడా నన్ను వదిలేస్తుంది.

అమ్మ…
నీ ప్రేమకి అర్థం తెలియడానికి
నా జీవితం అంతా సరిపోలేదు,
కానీ నీ లేకుండా బ్రతకడం
ఒక శిక్షలా మారిపోయింది.

ప్రతి సంతోషం ముందు
ఒక నిశ్శబ్దం ఉంటుంది,
అది నీ లేని లోకం అని
నా ప్రాణానికి తెలిసిన నిజం...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy