నిశీధి నియంత
నిశీధి నియంత
అందమైన రెండు మనసులు! ఏకానికై తపించిన రెండు శరీరాలు!
"ఆ ఏకాంత సమయంలో మయమరచి పోయిన ప్రియిడి భావాలు"
చిలిపిగా చూస్తూ రెచ్చగొడుతున్న నీ నయనాలు!
ముద్దుకై సిగ్గుతో ఎదురుచూస్తున్న నీ బుగ్గలు!
అదరాలపై కవిస్తూ నాట్యం చేస్తున్న నీ చిరునవ్వులు!
సెలయేటిని తలపిస్తున్న నీ నడుమొంపులు!
మంత్ర ముగ్ధుడ్ని చేస్తున్న నీ నాభిసొంపులు!
కొంటెగా పిలుస్తున్న నీ కొంగు చాటు మడతలు!
రా అంటూ సువాసనలు వెదజల్లుతూ లాగుతున్న నీ
మకరందాలు!
కరిగిస్తున్న నీ వయ్యారాలు!
ఇక ఒంటరితనానికి వీడ్కోలు!
మన ఏకానికి ఈ ఉర్వి ఆ మిన్ను సాక్షాలు!
అందాలతో ఎంతటి వాడినైనా ఓడించి వశం చేసుకోగలదేమో! అందుకేనేమో ఆమె నిశీధి నియంత!

