అలలపై తేలే పడవ
అలలపై తేలే పడవ
1 min
9
సంద్రం ఈదిన ఓ జీవి.......
మునిగిపోతూ తెలుసుకున్నాను
------ ప్రతి రోజు ఓ కొత్త ఆరంభమని
మునిగిపోతూ తెలుసుకున్నాను
------ అన్ని సుడిగుండాలు మంచికేనని
మునిగిపోతూ తెలుసుకున్నాను
------ అన్ని కథలు ఆనంద తీరాలు చేరవని
మునిగిపోతూ తెలుసుకున్నాను
------ఆనందం మనస్సున దాగుందని
మునిగిపోతూ తెలుసుకున్నాను
------- పశ్చాతాపమే నరకమని
మునిగిపోతూ తెలుసుకున్నాను
-------- పశ్చాతాపం దాటాకనే స్వర్గమని
మునిగిపోతూ తెలుసుకున్నాను
------- ప్రతి శ్వాస తాత్కాలిక తీరమని
మునిగిపోతూ తెలుసుకున్నాను
-------ప్రతి అడుగు అంతానికి నిచ్చెనని
మునిగిపోతూ తెలుసుకున్నాను
--------ఈ జీవితం అలలపై తేలే పడవని
తెలుసుకోలేక పోయాను
------- అన్ని తెలిసే నాటికి మృత్యువు నన్ను హత్తుకుంటుందని!!!!
