STORYMIRROR

Ratna Vattem

Romance

4  

Ratna Vattem

Romance

నిరీక్షణ

నిరీక్షణ

1 min
493


సాయంసంధ్య వెలుగులో

సాగరతీరం లో

నిన్ను కలవాలని 

ఎన్నో ఊసులాడాలని

ఎన్నాళ్ళుగానో వేచిచూచి

నా మదిలో తలపులు కూర్చి

ఆశల హరివిల్లు రంగులన్నీ

వంటికి చీరగా చుట్టి

నిద్దురలేని కాళరాత్రుల నలుపు

కంటికి కాటుకగా పెట్టి

నీ ఊపిరి జ్ఞాపకాల

విరజాజులు

నీ వెచ్చని స్పర్శ రేపే

వింతమోజులు

అన్నింటినీ నీకు నైవేద్యంగా

సమర్పించాలని

నేను ఎదురుచూస్తుంటే

చుప్పనాతి సూరీడు

పోతూపోతూ 

మన ప్రణయగాథలు విని

తనకు విన్నవించమంటూ

నీలిమేఘాల నంపుతున్నాడు,

వద్దు రావద్దని వేడుకుంటూ

ఆ మేఘాలకు లంచమిచ్చి 

నీ రాక కోసం నే వేచి ఉన్నాను।।



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance