కుర్రగాలి నవ్వింది
కుర్రగాలి నవ్వింది


చల్లగాలులు కమ్మని కబురులు చెబుతుంటే
పిల్లగాలుల అల్లరికి ముంగురులు రేగుతుంటే
పైరగాలులు తుంటరిగా పైట లాగుతుంటే
విరహకాలపు నిట్టూర్పులు వెక్కిరిస్కున్నాయి
నువు చెంత లేవని నవ్వుతున్నాయి
ఎదురుచూపులు మదిని కలవరపెడుతుంటే
తీపిజ్ఞాపకాలు నాలో గుబులు రేపుతుంటే
మనసు చెమ్మగిల్లి కన్నీరై కరుగుతోంది
విరహవేదనలో హృది భారమవుతోంది
వేలాది కన్నియల తలపుల నిండిన
వేణుగోపాలుని వలపు నీకెందుకంటూ
సందెగాలులతో చేరి మేలమాడుకుంటూ
కుర్రగాలి నవ్వింది నా మేను నిమిరింది।।