STORYMIRROR

J swethagodawari

Drama Romance

4  

J swethagodawari

Drama Romance

నీతో ముడిపడ్డాకా...

నీతో ముడిపడ్డాకా...

1 min
535

వజ్రపుటుంగరమొకటి కొనివ్వమని అడిగాను

"నీ కళ్ళలోని మెరుపులకంటే ఆ వజ్రపుమెరుపులు యేపాటివి" అని నీవంటే..

చెప్పలేని ఆనందంతో నాలోనేను మురిసిపోయాను!


సరదాగా సినిమాకు వెళదామని అడిగాను

"మన ప్రేమకథ ముందు ఈ సినిమా కథలు యేపాటివి" అని నీవంటే..

మనది ఎంత గొప్ప ప్రేమోనని పొంగిపోయాను!


నా మొబైల్ నంబరుకు రీచార్జ్ చేయించమని నిన్నడిగాను

"అలా పార్కులో కూర్చొని నీతో మాట్లాడితే ఉండే మజా ఫోనులో ఉండదు" అని నీవంటే..

ఆహా.. నా మీద నీకెంత ప్రేమోనని ఆనందపడ్డాను!


నాకిష్టమైన చల్లచల్లని ఐస్ క్రీం ఒకటి కొనివ్వమని అడిగాను

"నా బంగారానికి జలుబు చేస్తే నా మనసు తట్టుకోలేదసలు" అని నీవంటే..

నేనంటే నీకు ఎంత ప్రత్యేకమో అనుకొని సంతోషపడ్డాను!


కానీ...

నీతో ముడిపడ్డాకా..

నువ్వంటే ఏమిటో తెలిసింది!

నువ్వు ఒక మహా పిసినారివని!

ప్రపంచంలోని పిసినారుల్లోకెల్లా చాలా గొప్పవాడివని!!

అంతకుముందు నీ మాటలన్నీ ఉత్తుత్తివని!!

😏😏😏


- J Swethagodawari©®™

Wrote on :- 18/02/2020


Rate this content
Log in

Similar telugu poem from Drama