నీకు వందనం
నీకు వందనం
నాలోని సంతోషాలకి సానబట్టి
అక్షరం గా మార్చిన కవిత్వమా..
నీకు వందనం
నిరాశా,నిస్పృహలకు రూపమిచ్చి
వడగాడ్పులనుండి విరామ మిచ్చిన వింజామరమా..
వేదనల అగ్నిగుండంగా లోనుండి,
సమస్యల సుడిగుండాలు నుండి ,
బయటకు లాగి, ఆసరా ఇచ్చిన నేస్తమా!
వాడిపోయిన ,రాలిపోయిన మనసు పుష్పానికి
వసంతాన్ని చ్చి చిగురింప చేసిన నా ప్రియతమా..!
నీవే ఒక మత్తుమందై నన్ను లొంగదీసుకుని,
నిద్రింపచేసి, జాగృత్ సుషుప్తి లోని స్వప్న శకలమా....
నాకైన
మానసిక అధైర్యానికి, అసౌకర్యానికి,
చిత్త చాంచల్య చేష్టలకు,....
అక్షర సాహితీ వైద్యం చేసిన
కవిత్వమా...!
నా బ్రతుకుకు దారి దీపానివై,
నా జీవిత పరమార్ధానివై,
నా అంతరంగం భాషిణివై,
సౌందర్య రేఖా విలసిత
గజలు గానమై,
వాసంత సమీరమై
హేమంత తుషారమై,
శరద్వల్లరి వై,,
సారంగి గానమై..
తూరుపు సిందూరంలా
నా నుదుటన
కుంకుమ రేఖవై
నిరంతరం నా చేయి పట్టి
నడిపించే
నా హృదయమా....
నీకు శతకౌటి వందనాలు.....