మనసా
మనసా
1 min
158
వట్టిపోతుంటే దేహం వగలు పడతావెందుకు మనసా
సచ్చి పోతుంటే సారం సంసారమంటూ సమసి పోతావు ఎందుకే మనసా
హరే రామ హరే కృష్ణ అంటూ ముక్తి కొరకు పాకులాడవు ఎందుకే మనసా
కల్పితాల కలుషుతం అవుతూ జన్మను నిరార్థకం చేసుకుంటావు ఎందుకే మనసా...
కీర్తి కిరీటాలు ఎన్నివున్నా సొమ్ములేని బతుకు సున్నా మనసా
ఎంత ఎదిగిన నేమి మనిషి మమత లేకపోతే మట్టితోటి సమమే మనసా ..
సావదానముల సంసారమే ఎదుగు ప్రశ్నార్ధకముల పూర్ణకుంభమే పగులు మనసా
మనిషి మనిషిగా లేని నాడు దుష్ట పీడలెన్నో చెంత వచ్చి చేరు మనసా..