Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీదీ ఓ బ్రతుకేనా

నీదీ ఓ బ్రతుకేనా

1 min
175


నీదీ ఓ బ్రతుకేనా ముఖాన అచ్చేసిన అవే పన్నెండు ఘటనలేగా..

నీ బ్రతుకున.. ఎంత బ్రతికినా ?


ఐనా గడిచిన ప్రతి ఘటననీ గర్వంగా గంటకొట్టి మరీ చాటిస్తావ్‌

చీకటి వెలుగులయి సమానంగా సాధిస్తావ్‌


ఎన్ని బ్రతుకుల వర్తమానలని మింగి గతింప చేస్తావ్‌ విగత జీవుల్ని చేస్తావ్‌ ?

ఎన్ని ఆనందాలను జ్ఞాపకాలు చేస్తావుఎన్ని ఆశలు నిరాశలు చేస్తావ్‌ ?

నీదీ ఓ బ్రతుకేనా ?


కర్కశ మైన నీ ముళ్ళ ముఖాన్ని గోడకు శిలువేసినాసుడిగుండంలా తిరుగుతూప్రపంచాన్ని కబళిస్తావు ..


అవిశ్రాంతంగా.. అందరి బ్రతుకు వెనక అగాధాలను తవ్వుతూనే ఉంటావు

నీదీ ఓ బ్రతుకేనా .. ?


నువు దాటిపోయేదాకా నీ ముఖన్నెందుకు దాటేస్తావు ?

వస్తున్న అలికిడినీ ఎందుకు దాచేస్తావ్‌ పిరికి పంద ... ఎదురొడ్డి ఓడిస్తామనేగా నీదీ ఓ బ్రతుకేనా ?


Rate this content
Log in

Similar telugu poem from Romance