నీ రాకకై నిరీక్షణ
నీ రాకకై నిరీక్షణ


యడబాటనే కుంగుబాటు బాధిస్తున్నా..
పొరపాటనే భంగపాటు బంధిస్తున్నా..
కనుపాపకి కునుకు దూరమై కలవరపెడుతున్నా..
కంటికి కన్నీళ్లు కరువై కలచివేస్తున్నా..
క్షణక్షణం నీ రూపును భ్రమిస్తూ..
అనుక్షణం నీ పిలుపును జపిస్తూ..
తక్షణం నీ తలపును తపిస్తూ..
ప్రతి క్షణం నీ వలపులో నిద్రిస్తూ..
ఆలపించనా చెలియా నా ఆవేదన!
ఆలకించవా సఖియా ఈ అభ్యర్థన!!
ఆదరించవా ప్రణయమా నా ఆలోచన!
ఆశించనా ప్రియతమ నీ ఆదరణ!!
మనసులో మాటువేసిన మధుర భావం!
వాక్యాలుగా పెనవేసిన ప్రతి పదం!!
నీ దరికి చేర్చనా ఈ కన్నీటి కావ్యం!
నా దరికి చేరదా ఆ చిరకాల స్నేహం!!
నీ యద లోగిళ్ళలో విశ్రాంతికై,
ఒంటరిగా సంచరిస్తున్న ఓ బాటసారిని!
నీ జత కౌగిళ్లలో బందీకై,
ఓపికతో పరితపిస్తున్న "ఓ ప్రేమ పిపాసిని"!