నేనొక మాట చెప్పనా
నేనొక మాట చెప్పనా
నేనొకమాట చెప్పనా...
కల్పాలు దాటి ప్రళయకాలం వరకు
బ్రతికే ఆయువే నాకుంటే...
ఆకాశమంతటి ప్రేమ గుండెల్లో
దాచాను నువ్వంటే!!
నిధులన్నీ రమ్మంటూ ఆశచూపినా
నా నడక నీవెంటే!!
బ్రతుకనే బాటలో
మరణమనే మూటను మోస్తున్నా...
బ్రతుకుపై ఎంత తీపో నువ్వు తోడుంటే!!
పూలపరిమళాన్ని ప్రాణవాయువును చేసి
తారల మెరుపును ఆశగా చేసి
ప్రకృతిని ప్రాణమున్న దేహాన్ని చేసుకొని
పచ్చదనాన్ని చిరునవ్వుగా మార్చుకొని
అలుపెరుగని నది నడకలా
కాలం చేతిలో ఓడిపోకుండా...
మరణంలేని...
ముదుసలితనం రాని దేహంతో...
నిరంతర సృష్టిలో మమేకమై
నీకోసం నిలిచి పోనా అవనిపైన
దేవుడు వరమిస్తానంటే!!