నాలో.
నాలో.
నిండిపో నాలో
ఉండిపో నాలో
మనసు నుండి నీ ఆలోచనలు
చేదిరిపోనీకుండా...
నా కళ్ళముందు ఎల్లప్పుడూ
నువ్వే నిలిచిపో...
కళ్ళలో నీ రూఫు కరిగిపోనీకుండా...
మనసులో సదా ..నిరంతరం
నీవే స్థిరమై పో..
భావన నాదైనా భావం నువ్వై నిలిచిపో...
నా అడుగుల గమ్యం నువ్వే అయినా...
అడగుకి నీ అడుగు జతగా ...
నాతోడు నీవై మసలుకో...
తలచేది నేనె అయినా..
నా తలపు మాత్రం నువ్వైపో
మదిలో భావమై .......యోగమై... ధ్యానమై ...
అణువణువునా రసరమ్య కావ్యమై...
తుదివరకు సాగనీ ఈ గమనం
కనుల కాంతివై...హృది రూపమై....
నా జీవనగమనమై.....
అంతటా కొలువై ఇమిడిపో...
నేను నువ్వైనా నువ్వు నేనైనా
కనుల పండువు గా కళ్ళముందు నిలిచిపో..
మది రంజిల్లగా మురళి నాదమై....
మోహన రూపమై....రసరమ్య కావ్యమై..
కల్యాణ వైభోగమై నాలో చేరిపో..
... సిరి ✍️❤️

