నాదో ప్రపంచ
నాదో ప్రపంచ
నాదో ప్రపంచం
వినీల ఆకాశవీధిలో నా పయణం
పాలపుంతలతో సహవాసం
తారామండలిలో ఆవాసం
ఒక్కో గ్రహంతో విడదీయరాని బంధం
ఇన్ని పాలపుంతలలో ఎన్నో గ్రహాల భ్రమణం
గ్రహశకలాల ఆవిర్భావం
కృష్ణబిలం తో నశించెను సర్వం
గ్రహ విస్ఫోటనం
ఇంకో నూతన గ్రహానికి,యుగానికి ఆవిర్భావం
మరో కొత్త ప్రకృతికి నాంది పలకడం
మరో కొత్త జీవరాశులకు ఆవాస యోగ్యం
జీవ రాసులకి నా గమనం
అగమ్య గోచరం
జీవులు ఎరుగని పుట్టుక రహస్యం
అయితే
అన్నింటికి తెలుసు నా నివాసం
అంతటికి తెలుసు నా విశ్వ రూపం
అందరిలోనూ ఉన్నది నా ఆత్మస్వరూపం
నమ్మలేనివారికి అదొక చిదంబర రహస్యం
నమ్మిన వారికి అదొక మోక్ష మార్గం
ఎన్నో పాలపుంతల్లో
ఎన్నో గ్రహాలలో
తిరిగి తిరిగి
విసిగి వేసారి
ఇలా విచ్చేసాను
నీ మనసులో
నీ మనోధైర్యంలో
తిష్టవేశాను
ఇక నీదే ఆలస్యం
ఎక్కడెక్కడో నను వెతకటం మానెయ్యి
నీలోనే వెతుకు
అప్పుడు కనిపిస్తాను
ఇంతకీ ఎవరు నేను
నువ్వు ఏ పేరెట్టిన ఆ పేరుతో పలుకుతాను
నీ పిచ్చి కాకపోతే సృష్టి కర్తనే నేను
నా ఆవాసమే నీకు అంతుచిక్కదు
నాకు మతమేమిటి
నాకు జాతేమిటి
నేను అందరితోనూ వుంటాను
అన్నింటా ఉంటాను
నువ్వు నమ్మినా! నమ్మకపోయినా!

