Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా ఊహల స్వర్గం

నా ఊహల స్వర్గం

1 min
226


నా మనసు గదిలో గీసుకున్న హరివిల్లు చిత్రం

జల్లులు కురిసే వానలా మాట్లాడుతుంది

నింగికేదో వర్తమానం పంపిస్తున్నట్లు

కలల రంగుల భాషను మౌనంగా వినిపిస్తుంది..


అలల తీరాల స్వప్నం కన్నీరు కారుతుంది

ఇంద్రధనస్సుల ఉయ్యాలలో ఊగుతూ

సీతాకోకచిలుక రెక్కల వర్ణాలు చూపిస్తున్నట్లు

తొలకరి చినుకుల్లో వాసనలు వెదజల్లే..


పచ్చని కొమ్మల్లో పక్షి కిలకిల నవ్వింది

ఉరుముల్లో ఆనంద భైరవి రాగం పలికింది

సెలయేటి గలగలలు నేలపై చిందర వేసే

సౌందర్యపు కొండలు స్వర్ణ కాంతులతో వెలుగును...


ఊట బావిలో పదాలను పోగు చేస్తుంటే

భావాల పూల మొక్కలు బ్రాంతిని కలిగించే

నాట్యాల మయూరాలు పింఛం విప్పి

ఆమని తో ఆనందాలు పంచుకొని సాగెను...


అద్భుతమైన వాక్యాలు కవితకు సొగసునిస్తే

మకరందపు మనసులో శృతిలయలు పలికే

రసికులు పోషకులై కావ్యాలను ఆదరిస్తే

సాహిత్యపు తోటలో తియ్యటి ఫలాలు పండేను..


కలంలో సిరా చుక్కలు రుచికరమై మురిపిస్తే

భావ సౌందర్యం కోయిల పాటలా వినిపించే

అక్షరమే స్వేచ్ఛ పక్షి లాగా ఎగర గలిగితే

కవి స్వతంత్రంగా మరో స్వర్గమే నిర్మించుకుంటాడు..



Rate this content
Log in

Similar telugu poem from Romance