నా మది తలుపులు
నా మది తలుపులు
చెలియా.........!!!!!!
"నా" మది తలపుల మరుమల్లెల పరిమళానివో..!!
"నా" హృదయంలో మొదలైన తొలి అలజడివో..!!
"నా"కనులలో మెరిసే అందమైన రంగుల కలవో..!!
వాన మబ్బులలో దాగిన ఏడురంగుల వానవిల్లువో..!!
మానస సరోవరాన వికసించిన సువర్ణకమలానివో..!!
"నా"మదిని సుతారంగా తడిమే మలయమారుతానివో..!!
ఏ కవి లిఖించిన ప్రణయ కావ్యానివో ..!!
ఏ దివిలో విరిసిన నవపారిజాతానివో..!!
ఏ జన్మలో ఋణానుబంధానివో..!!
అనురాగబంధమై నిలిచావు "నా"....హృదయంలో.........!!!!!!!