Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా హృదయం

నా హృదయం

1 min
310


నా మురళిగ నీవున్నది..చెబుతున్నది నా హృదయం..!

నీ మౌనపు స్వరమాధురి..వింటున్నది నా హృదయం..!


ఈ తనువున అణువణువున..వేనవేల కోవెలలే..

నీ నవ్వుల దీపాలను..చూస్తున్నది నా హృదయం..!


ప్రశాంతతకు అద్దంలా..వుంది కదా ప్రతి నిముషం..

గుండె గువ్వ పరవశమును..మోస్తున్నది నా హృదయం..!


వింతవింత అనుభవాల..తోటలోన నీ జతలో..

చెలిమిపూల పరిమళమే..అవుతున్నది నా హృదయం..!


అమృతమధుర శాసనాల..మేఘమాల నీవేగా..

ఓతియ్యని ప్రేమలేఖ..వ్రాస్తున్నది నా హృదయం..!



Rate this content
Log in

Similar telugu poem from Romance