మనసు మనసుతో
మనసు మనసుతో
మనసు మనసుతో ఊసులాడుతుంటే
మదిలో ఏదో అలజడి రేగుతుంటే
మదిలో భావాలు అలల్లా ఎగిసిపడుతుంటే
నీ తలపులే పూలజల్లులై
ఎదను తడిమేస్తే
విరిసిన అరవింద మోములో
సిగ్గు దొంతరలు
తొంగిచూస్తే
ఆకాశం ఆ చెక్కిళ్ళలోని ఎరుపు
సంతరించుకుంటే
పచ్చని చిగురాశలు సంద్రంలోని
అలలై కాళ్ళను
తడుముతుంటే
అంతులేని ఆనందం
నా సొంతమైంది
ఆ ఆనందం హరివిల్లులా
నా మనసున విరిసింది

