Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మన్నించుమా హరా!

మన్నించుమా హరా!

1 min
232



1.ధ్రువకోకిల /


ముఱికి కూపము వంటి లోతగు మోహ మందున మున్గితిన్ 

గరము లెత్తుచు నిన్ను వేడితి కావరాగదె

యీశ్వరా!

స్మరణ మాత్రము జేత మమ్ముల చక్కదిద్దెడి దేవరా!

దరికి జెర్చవె దీన రక్షక!దాసినై నిను గొల్చెదన్ /


2.చంపక మాల /


మనసిది చంచలంబు పలు మాయలు నేరిచి ప్రల్లదంబుతో

తనువును త్రిప్పుచుండు

దురితంబగు కార్యములెల్ల చేయుచున్

ఘనమగు నీదు భావనను గైకొన దక్కట!యో మహేశ్వరా!

మునుకొని మంచి బుద్ధినిడి ముక్తిని పొందెడి దారి చూపుమా!


3.ఉత్పల మాల /


మత్తగజంబు వోలె మది మత్తిలి దూకుచు మోహమొంది తాన్

చిత్తము వచ్చినట్లు చని జీవితమంతయు కుళ్ళి పోవ నీ

సత్తెపు రూపమున్ గనక సంకర మొందెడి హీనమైన ప్ర

వృత్తిని మార్చ రాద!కని పెంచెడి తండ్రిగ ప్రేమతో హరా!/

-------------------------



Rate this content
Log in

Similar telugu poem from Classics