STORYMIRROR

Midhun babu

Classics Inspirational

3  

Midhun babu

Classics Inspirational

మనిషి బుద్ధి

మనిషి బుద్ధి

1 min
0


మోసపూరిత మాటలు నమ్మావో ఉబిలోకి దిగినట్లే,

అమాయకంగా ఉన్నావో

బురద నీకు అంటినట్టే,

అహంకారంతో జ్ఞానానికి

దూరం అయ్యావో

రొంపిలోన వున్నట్లే,

కళ్ళుమూసుకు తిరిగావో

గోతిలోన పడ్డట్లే,

పరిహాసమే నేస్తమైతే

మురికి ముచ్చటే చెంతనిలుచు,

చిరాకు పరాకులే

 హృదయ నేత్రాలైతే

యమయాతనలే దగ్గరవ్వు,

మత్తే తనువుకు చుట్టమైతే

కుడిఎడమగా కనిపించి మట్టుపెట్టు,

తీపిచేదు తేడా మరచిపోతే 

ప్రతి తలపు

రొచ్చురాగమే ఆలపించు,

అలుపెరుగని పరుగే నీదైతే

గొయ్యికూడా సెలయేరై పలకరించు.

నడకలోనూ నడతలోనూ పరమార్ధం గ్రహీయిస్తే

మనసుపడే యాతనే వీడిపోవు.


Rate this content
Log in

Similar telugu poem from Classics