మనిషేనా
మనిషేనా


మనిషేనా
నేను మనిషేనా...
మాయా ప్రపంచము
మకిలంటిన మంచితనం
మూఢా లోకము
మరుగున పడిన మానవత్వం
మోసపు దేశము
మలినమైన బంధం
మత్తులో జగత్తు
ముక్ఠలవుతున్న సంసారం
మనిషేనా
నేను మనిషేనా
మాయా ప్రపంచం
ముక్కిన ధర్మం
మూసుగేసిన రాజ్యం
మూలుగుతున్న న్యాయం
మసకేసిన ధరిత్రి
మూగబోతున్న సత్యం
మూస ధరిణి
మాసిన నీతి
మనిషేనా
నేను మనిషేనా
-సామాన్యుడు