మారెను
మారెను
యెదలో కదిలే భావపు ఝరులే అంతే తెలియని జలధిగ మారెను
తీరం చేరే సమయం కొరకే చివరికి, పొంగే అలలుగ. మారెను..
మనసే మౌనపు దీపం కాగా.మదిలో వెలుగును చైతన్యంగా..
వికసిత జలజం కళికగ మారదు తీరని తపనలు జ్యోత్స్న గ
మారెను
వలపే వరమై కురిసే వేళా, విరహపు జ్వాలే సెగలే రేపెను..
కదలని శిలయే కరిగి పోవగ, కన్నుల రెప్పలు బరువుగ మారెను.
కోరిక బుసగా పడగే విప్పెను..అంతరంగమున ఆశయె విషమై
ఆశయమందున దైవము చూడగ ..కవితే అమృత ధారగ మారెను...
కంచికి చేరని కథలే ఎన్నో..ధైర్యము వీడక భవితయె నిలుపుము
వేదన రోదన తాత్విక బలమై, ఎదురే లేనీ శక్తిగ మారెను....