సత్యాన్వేషణ
సత్యాన్వేషణ
సత్యమేదో తెలుసుకోవోయి,
పలకరించు జగతిలోని మాయలే తెలుసుకోవాలోయి.
నిశ్చలమౌ అంతరంగం
గందరగోళం చూడదోయి,
ఉడికించు మనసుకు
మోసాలరుచి తెలియదోయి,
సంబరాల లోకంలో విజ్ఞతతో మెలగాలోయి,
పాలు నీళ్ళు ఒకటిగా చూపే
మాయమాటలు నమ్మడమే దుఃఖనదిలో ఈదుటేనోయి.
ఊబిలోన దించేటి మాటలను
హృదయానేత్రంతో పరిశీలించాలోయి,
అమాయకత్వమే గుండెగుబులు నేస్తమోయి,
గమనించుటే జ్ఞానద్వారమోయి,
కనురెప్పల నీడలో సత్యాన్వేషణ వుంటేనే
మురిపించే ముచ్చటే సొంతమగునోయి.