కలలా రాకుమారుడు
కలలా రాకుమారుడు
కలలోకి వచ్చాడు
నా అందాల రాకుమారుడు,
తలవాకిట చిరునవ్వుల మెరుపుగా కనులముందు నిలవాలి వాడు.
పెదవిపెట్టు చిలిపిముద్దుతో
మనసు అల్లుకొనువాడు,
వయసు సల్పు వలపుపోరు
దిగులు తీర్చువాడు,
అందాలమేడలోకి నడిపించు భాగ్యసఖుడు,
ప్రణయవీణ పలకుల
సరసరాగ శ్రుతివాడు,
గుండెలయకు చెలిమిగా వుంటూ నన్నేలు నావాడు.
మోహపు కోర్కెలతో
మనసు పాడుచేసుకోకే
టక్కరి వాడైతే వాడుకొని వదిలేస్తాడే,
పసిడిమేడ ప్రేమజగతి కాదే
మనసందం చూడాలే,
తలపులలోని నవమన్మధుడు
బుద్ధిహీనుడైతే
హృదయాగ్నిగుండానికి ప్రేమే సమిధగా మారునే,
కలలవీధి నుండి బయటకు వచ్చి లోకంచూడవే
చింతలులేని రేపటిలో నీప్రేమను నిలపవే.

