హరివిల్లు నీ రూపం
హరివిల్లు నీ రూపం
ఆకాశంలో వెలిసే నెలవంక
నువ్వేనా....
.
హరివిల్లులో విరిసే రంగవల్లి
నువ్వేనా.....
మేఘంలో మెరిసే చినుకువి
నువ్వేనా..
మదిలో మెదిలే సరాగానివి
నువ్వేనా......
నువ్వు ఇలా
అలల్లా ఉరకలేస్తూ వస్తూ ఉంటే
నే తీరమై నీ చెంతకు రాలెనా.....
నువ్వు మబ్బువై ఇలా
చూస్తుంటే మెరుపుల్లా
మిరుమిట్లుగొల్పోతూ
రానా నీ దరికి.......
నిన్నలా తలచిన మరుక్షణం
మధుర భావనలే కలిగిస్తూ...
మరిపిస్తూ నా కంట్లో వెలిగే
నీ రూపం ఎంత అపురూపం!!!!!