హంగామా
హంగామా
ఉరుమేమో అనుకున్నా..తన చూపుల హంగామా..!
సెలయేరని అనుకున్నా..తన నవ్వుల హంగామా..!
ఆ గాలికెలా చెప్పను..గుండెతడిని ఆర్పద్దని..
మధుమాసం అనుకున్నా..తన ఊసుల హంగామా..!
శరద్వాణి ముచ్చటలను స్వాగతించు వేళ కదా..
మంచువాన అనుకున్నా..తన ముద్దుల హంగామా..!
మెఱుపుపూల రాగాలను..వింటూనే మైమరచా..
అనురాగం అనుకున్నా..తన వలపుల హంగామా..!
అరకన్నుల చూస్తుంటే..సంగతేమొ తెలిసిందే..
సంగీతం అనుకున్నా..తన పరుగుల హంగామా..!