హిమగానం
హిమగానం
నీకోసం నా మనసే సుమగానం అయినదిలే..!
నీ తలపే నా లోలో శుభగానం అయినదిలే..!
ఆ చుక్కల తోటలోని..పూలేగా నీ నవ్వులు..
నా వలపే నిను కోరే..ప్రియగానం అయినదిలే..!
వ్రాయరాని అక్షరాల..కొలువేగా నా హృదయం..
నిను పిలిచే..మౌనరాగ..నవగానం అయినదిలే..!
విధిలిఖితం లేదన్నది..రుజువుచేసె నీ స్నేహం..
గుండెలయల సవ్వడికే..జయగానం అయినదిలే..!
పలకరించు వసంతాల..కలలకు మరి అద్దమేదొ..
ఉషోదయపు ఊయలలో..హిమగానం అయినదిలే..!

