ఏమో
ఏమో
గాల్లో తేలిపోయాను.
ఊహల్లో కదిలిపోయాను.
పక్షిలా ఆకాశపు అంచులకు ఎగిరాను.
సంతోషంలో మునిగిపోయాను.
అనుకున్నాది జరుగుతుంది అని పొంగిపోయాను.
ఈప్రపంచమంతా కొత్తగా కనిపించింది.
ఏదో లోకంలో ఉండిపోయాను.
అంతాశుభమే అనుకునే లోపు ఓకుదుపు వచ్చింది.
అల్లకల్లోలం చేసి వదిలేసింది.
జరగదాని తెలిసిపోయింది.
పిడుగు వచ్చి మీదపడిపోయినట్లు అనిపించింది.
దిక్కుకుపిక్కటిల్లేలా అరిచిన లాభం లేదు.
ఏదోఅనుకుంటే ఇంకేదో అయిపోయింది.
ఈబాధ భరించలేని వేదనగా మారిపోయింది.
ఎవరెస్ట్ శిఖరం నుంచి కిందపడిపోయాను అనే భావన.
ఎంత ప్రయత్నించిన విఫలమైపోయింది అనుకున్నది
ఇంకేదో జరుగుతుందో తెలియదు ఏనాటికి.
