STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చూడర మిత్రమా

చూడర మిత్రమా

1 min
5

చూడర మిత్రమా చూడర మిత్రమా– ఈ లోకం తీరును చూడరు మిత్రమా 
రంగుల లోకం మాయల జాలం – నమ్మి మోసపోకుర మిత్రమా 
ప్రాణం ఇచ్చే స్నేహితుడంటూ – నీతో నడిచే నీడను అంటూ
సమయం చూసి వెన్నుపోటు పొడిచే – మనుషులు ఉన్నారే ఇక్కడ మిత్రమా 
స్వార్థం కోసం బంధాలు అల్లే – కపటపు నవ్వులు చూడర మిత్రమా 
డబ్బు ఉంటేనే విలువ ఇస్తారు – లేకుంటే నిన్ను విసిరి కొడతారు
కన్నవాళ్లను కాదనుకొని పోయే – కాలం వచ్చింది చూడర మిత్రమా 
కష్టాలు వస్తే నీతో నిలిచే – నిజమైన తోడు ఎవరో చూడర మిత్రమా 
ఆశల వెనుక పరుగులు తీస్తూ – జీవిత పరమార్థాన్ని మరుస్తూ
క్షణిక సుఖాల భ్రమల్లో మునిగి – బతుకును చెడగొట్టుకోకుర మిత్రమా 
కళ్ళు తెరిచి నీ అడుగులు వేసి – నిజమైన మార్గం ఎంచుకో మిత్రమా 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar telugu poem from Classics