STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

బ్రతుకు దారులో

బ్రతుకు దారులో

1 min
3

రూపురేఖలు మెరిసి మాయమౌతూ

మేనంతా అహం మేనిఫెస్టో నిండుగా

కలిలో కలలన్నీ కాసుచుట్టే పయనం

మనిషి మాయమౌతున్న జాడలలో 

నెలవంకంతైనా స్వచ్ఛతకు స్థానమేదీ


రూపీ కోసం మహా మహా మోసాలు 

 నిజమంటే అక్కసుగా కరుస్తుంటే 

బతికున్న ఆనవాళ్ళెక్కడో దుర్భినేసినా కానరాదు 

ఎక్కడనీ గుణగణవిభజన చేద్దాం 


కళ్ళముందే భూ కబ్జాలు 

న్యాయమడిగితే ఆగడాల దాడులు 

వంతపాడే వందిమాగదులు

ఆధిపత్య పోరులో బలహీనులు 

సమిధలు 


ఎందెందు వెతికినా గురివింద గణాలే

ధర్మం సత్యం సమాధులపై నడకలే


విషముష్టి ముళ్ళ గడుసు తనాల్లో

మనసుకేమైందీ మానవతే మాయమా

చుట్టాలు పక్కాలు రక్త సంబంధాలు 

కాసుల తులాభారంలో తూకాలు


అరిషడ్వర్గాల ఊబిలోంచి బయటికొస్తే

పంచభూతాలు మనసుతో మమేకం 

నేనెవరో నీవెవరో బతుకేందో చితేందో

చిన్మయ ముద్రలో చిద్విలాసంగా తెలిసేది 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics