STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

బంధం

బంధం

1 min
174

తాళం లేని పెట్టె

గతమనే జ్ఞపకాల పెట్టెలో

భద్రపరుచుకున్న అనుభవాలెన్నో !


అవమానాల దొంతరలు

ఒక అరలో

అభిమానాల ఇస్త్రీ మడతలు

మరొక అరలో !


గాయాల మచ్చలు

ఒక వైపు

గౌరవాల అచ్చులు

మరోవైపు !


ఆడంబరాల డాంబికం

ఒక అరలో

అప్పుల పత్రాల వేదన

మరొక అరలో !


అనుభూతుల చల్లదనం

ఒకవైపు

నిట్టూర్పుల వెచ్చదనం

మరోవైపు !


స్వీయ తప్పిదాల శిక్షలు

ఒక అరలో

పరాయి మోసాల బలి

మరో అరలో !


తెగిన బంధాల ఆనవాళ్ళు 

ఒకవైపు

ముడివీడని పరవళ్ళు

మరోవైపు


జ్ఞాపకాల పెట్టి నిండా అరలే

ఒకదాని ప్రక్కన మరొకటి

ఒకదానిపై మరొకటి !


రహస్యాల మూతలేని

జ్ఞాపకాల పెట్టెను

గొళ్ళెంతో మూయనక్కర్లేదు

తాళం వేయనక్కర్లేదు !


గతానుభవాల పెట్టెను

గుణ పాఠంగా నేర్చుకొని

వర్తమాన మూతను

విజ్ఞతతో తెరుస్తుండాలి !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance