Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ravi Sarma

Inspirational

4.5  

Ravi Sarma

Inspirational

భిన్నత్వంలో ఏకత్వం !

భిన్నత్వంలో ఏకత్వం !

1 min
415


ఆత్మశుద్ధితో అది సంభవం గానీ ,

సమసమాజం ఎక్కడని ప్రశ్నిస్తే వస్తుందా ?

బ్రహ్మాండాన్ని అడిగితే బ్లాక్ హోల్స్ ని చూపెడుతుంది .

నీవే తెల్సుకో అని మౌనం వహిస్తుంది .

పుట్టుకతో ఎవరు విశేషమైన బుద్ధి కలిగినవారు ?

అందరూ సమానంగానే పుడతారు .

నేర్చుకోవాలనే వాడికి అడ్డేది ?

సంపాదించాలనుకుంటే ఆపేది ?

నియమాలు వ్రాసుకునేది మనమేగా ?

అంతా ప్రజాస్వామ్యమేగా ?

ఎన్ని చెప్పినా ; యోగి యోగే , భోగి భోగే .

ఆ తారతమ్యాన్ని మానసిక పరిపక్వత మాత్రమే

నిర్దేశించగలదు .

అందులో భిన్నత్వం కనిపించకుండా ఉండదు .

వేషభాషలు సంస్కృతిని అనుసరించి ఉంటాయి .

సౌలభ్యం , సమాజ ఆమోదం తీర్చిదిద్దుతాయి .

ఏమీ సందేహం లేదోయి .

అకృత్యాలకు అడ్డుకట్ట పరిపాలనలోని

పారదర్శకతతో సాధ్యం .

శిక్షణలో , చైతన్యపరచడంలో , నిబద్ధతలో

దాగి ఉంది విజయం .

కనుక , లేవండోయ్ ప్రజలారా ! కదలండోయ్ !

నీతి , నిజాయితీలను పాటించడంలో

సమానత్వం తేవాలండోయ్ !

అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం అని

ప్రతి ఒక్కరు గుర్తించాలండోయ్ !!

*********



Rate this content
Log in

Similar telugu poem from Inspirational