భార్య అంటే
భార్య అంటే
భార్యంటే బ్రహ్మ ఇచ్చిన భరణం కాదురా !
ఎప్పుడో ప్రాణం పోసి ఎక్కడో దాచి నీకిచ్చిన ఓ భూషణం రా !
వెలలో అనంతం ఆ ఆభరణం రా !
బ్రహ్మం ఎరగని రహస్యం రా !
నీ గృహానికే ఆమె ఒక అలంకారం రా !
నీ జీవన తరంగం లో ఆమె ఓ ఓంకారం రా !
భార్యంటే భారం కాదురా !
నీ బతుకులో ఆమె ఒక భాగం రా !
నీ భారానికి ఆమె ఒక భాగహారం రా !
భార్యంటే భాగ్యం రా ! భోగభాగ్యం రా !
నీ భాగ్యానికే ఆమె ఒక గుణకారం రా !
భార్యంటే తక్కెడ లో తచ్చలాడుతున్న సమభాగం రా !
హెచ్చుతగ్గుల లెక్కలు సర్వసాధారణం రా !
సరితూగు తులాభారానికి నీ భార్య ప్రేమానురాగం ఒక భాగం రా !
అదే మీ ఇద్దరి మధ్య రాయభారం రా !
భార్యంటే నీయింటి భారాన్ని మోసే ధరణి రా !
నీ ఇంటి పేరంటాన్న ఆమె ఒక కుంకుమ భరణి రా !
నీ ఇంటి తోబుట్టవులకు మేలు కోరే తరిణి రా !
శమంతకమణి ని మించిన మణి నీకు నీ భార్యామణి రా !
భార్యంటే నీ రాణి రా !
నీ ఇంటికే ఆమె మహారాణి రా !
నీ ఇంట ఆమె ఒక అలివేణి రా !
ఆమె పలుకే ఒక వాణి రా !
ఆమె కంఠం ఆకాశవాణి రా !
ఆమె మనసే ఒక అంతర్వాణి రా !
ఆలన పాలన కు నీకు నీ అమ్మైతే !
నీ సంసార పయనానికి నీ భార్య పాదం ఓ బోణి రా !
ఆమె పాదం నీ ఇంట పారాణి రా !
నీ ఎదుగుదలకు నీ తండ్రి నీకు
దన్ను అయితే
నీ పరుగు గమ్యానికి నీ భార్య పంచకల్యాణి రా !
నీ నీడే నీకు తోడు రా ! ఆ నీడను నిలపెట్టేది ఒక వెలుగు రా ! ఆ వెలుగే నీ భార్య రా !
ఆ వెలుగే లేకపోతే మాయం అవును నీ తోడు రా !
నీ భార్య నీ తోడుంటే నీవెక్కేది అంబరం రా !
కలకాలం కలసియుంటే
అదే ఆడంబరం రా !
ప్రతి ఋతువు నీకు వసంతమేరా,
ప్రతి రోజూ నీ ఇంటనుండు సంబరం రా !
అదుపు తప్పిన సంసార
బాటలో అడుగడుగునా గండం రా !
సరిదిద్దకపోతే అయ్యేది సుడిగుండం రా !
భార్యను బానిస అనువాడికి యుండు మనసు !
అదీ ఒక మనసా !
భార్యంటే భర్తకు ఇంత అలుసా !
మనస్సువిప్పిచూస్తే ! ఆమెలో యుండు మనసు !
మమతల మానస అని తెలుసా !
భార్యా భర్తలంటే
పార్వతీపరమేశ్వరుల పరమార్ధం అని
నీకు తెలుసా !
భార్యా భర్తల ప్రేమానురాగమునకు రాధాకృష్ణుల ప్రేమ ఒక ప్రతీక అని
నీకు తెలుసా !
ఈశ్వరుడు , శ్రీకృష్ణుడు భగవంతుని స్వరూపములు !
వారిలా ఇద్దరు భార్యలుండడం నీకు
అసంభవమని నీకు తెలుసా !
తెలుసుకోబోయావో అది నీ కర్మం అని
నీకు తెలుసా !
నీవొక రామచంద్రుడులాంటివాడివని
నీకు తెలుసా !
తెలుసుకోవడం నీ ధర్మం అని
నీకు తెలుసా !
అదే సుఖజీవనానికి జగమెరిగిన సత్యమని నీకు తెలుసా !
నీ సుఖజీవనానికి పరులు ఎరగని మర్మం నీకే తెలుసనీ
నీకు తెలుసా

