అందం
అందం
చూపున స్నేహపు..గంధమె అందం..!
తలపుల వాడకు..మౌనమె అందం..!
పాటకు స్వరాల..రెక్కలు ఎక్కడ..
పరువపు మేడన..విరహమె అందం..!
వెన్నెల పూవుల..చెట్టుగ మనసే..
వలపుల గదికో..తాళమె అందం..!
చెలి సౌందర్యం..పొగడుట ఎట్లో..
నదిలా పొంగే..పద్యమె అందం..!
తెలియని దారియె..తెగువకు తోడోయ్..
ముందుకు దూకే..ధైర్యమె అందం..!
ముగిసే ప్రతికథ..చరిత్ర గదిలో..
సాక్షిగ మిగిలే..తత్వమె అందం..!

