అమ్మను మించి నేస్తమున్నదా!
అమ్మను మించి నేస్తమున్నదా!
నే కళ్ళు తెరిచేలోగా ఆమె నా ముందుంది తన ముఖం చందమామ లా ఉంది....కానీ
నే ఏడుస్తూ ఉంటే తను నవ్వుతూ ఉంది....
నాకు కోపం వచ్చింది....
అయినా తాను ఇంకా నవ్వుతూనే ఉంది....కొన్ని రోజుల తర్వాత నే ఎక్కడికి వెళితే తాను కూడా నాతో రావడం మొదలు పెట్టేది....
ఎందుకు నన్ను వెంబడించి వేధిస్తూ ఉందో నాకు అర్ధమయ్యేది కాదు....
ఏమి చేయాలనుకున్న నన్ను ఎదో ఒకరకంగా ఆపేది....
ఓసారి నాకు దెబ్బ తగిలితే తన కళ్ళల్లో కన్నీరు చూసా....
అప్పుడు నాకు నవ్వొచ్చింది....నే ఏడిస్తే నవ్విన తను ఇలా ఎలా మారిందా అని.....
నాకు తెలియకుండానే తాను లేకపోతే నే ఉండలేని పరిస్థితి కి చేరుకున్నా....
నాకు ఊహ తెలిసేనాటికి తెలిసింది తాను మా అమ్మని....
నే పుట్టినప్పుడు నన్ను గెలిపించాలని తపనతో తాను తనతో యుద్ధం చేసి...
నన్ను గెలిపించి అంత బాధ లో కూడా తాను నవ్విందని నాకు తెలియటానికి మరో ఇరవై ఏళ్ళు పట్టాయి...