అక్షరాలు మౌనం
అక్షరాలు మౌనం
ఒక్క కన్ను లేకున్నా..చట్టానికి విలువున్నది..!
మాటలేవి రాకున్నా..మోసానికి విలువున్నది..!
చేతులు కాలిన మీదట..ఆకులకై వెతుకులాట..
వ్యాధి అదుపు కాకున్నా..వైద్యానికి విలువున్నది..!
కొడుకెవరో బిడ్డెవరో..కనిపెంచే వారెవరో..
ప్రాణమెగిరి పోతున్నా..బంధానికి విలువున్నది..!
తోలుబొమ్మ లాటేలే..సత్యమెవరి ఎఱుకనుంది..
మనిషి మాయమవుతున్నా..ద్రోహానికి విలువున్నది..!
చమత్కార మేమంటే..అహంకార మాభరణం..
వరద ముంచుకొస్తున్నా..గంధానికి విలువున్నది..!
సాహిత్యం సంగీతం..లలితకళల వెలుగెక్కడ..
హితంచేయు గుణమున్నా..వాదానికి విలువున్నది.
