STORYMIRROR

Chandini Balla

Drama Inspirational

4  

Chandini Balla

Drama Inspirational

ఆలోచిద్దామా!!

ఆలోచిద్దామా!!

1 min
349

మా అత్త ఇలా అందని నేను,నా కోడలు ఏదో అందని ఆమె..


నా భర్త ఇన్ని అన్నాడు అని నేను,

నా భార్య కించపరిచిందని ఆయన..


నా నెచ్చెలి నన్నేదో అందని నేను,

తనని నిందించానని తను..


మా అమ్మ ఇలా తిట్టిందని నా బిడ్డ,

నా బిడ్డ ఇప్పుడే ఇలా అంటున్నాడు అని నేను..


మా ఆడపడుచు వ్యంగ్యంగా మాట్లాడిందని నేను,

నేనే లేని పోని మాటలు కల్పించా అని ఆమె..


బాసు నీ గురించి చెత్తగా వాగాడని నేను,

నీ గురించి చెడుగా చెప్పింది ఆమె అని అతను..


మీ గురించి పక్కింటి ఆవిడ ఇలా అన్నదని నేను,

నా గురించి పక్కింటి ఆవిడ ఏదో చెప్పిందని ఎదురింటి ఆవిడ..


ఇలా అన్ని బంధాల లోనూ లొసుగులు, విసుగులు.

సూటిగా అడిగితే ఇంత రాద్దాంతం ఉండదేమో!!


ఎవరికో చెప్పేందుకు వాక్ స్వాతంత్య్రం వాడుకునే మనం,

సూటిగా మాట్లాడే ప్రయత్నం చేయడానికి వాడమెందుకో!!


సూటిగా మాట్లాడితే ఇన్ని గొడవలు రావు కదా!!

ఆలోచిద్దామా!!



સામગ્રીને રેટ આપો
લોગિન

More telugu poem from Chandini Balla

Similar telugu poem from Drama