STORYMIRROR

Ambica Lakshmi

Abstract Thriller Children

3  

Ambica Lakshmi

Abstract Thriller Children

విరిగిన రెక్కలు

విరిగిన రెక్కలు

1 min
130

విరిగిన రెక్కలు

అరిగిన మోకాల చిప్పలు

వంగిన నడుము

ఎన్నో నిద్రలేని రాత్రులు

చిరిగిన చొక్కా విరిగిన చెప్పు

వెనక వేసుకున్న ఎన్నో జబ్బులు

ఇది అంతా ఎవరి కోసం

దేని కోసం మీ కోసం

కడుపున పుట్టిన పిల్లల కోసం

వారి శ్రేయస్సు కోసం వారి అభివృధి కోసం

కానీ చివరికి ఏం మిగిలింది

తిట్లు ఇంటిలోనుంచి గెంటించుకోడం

లేదా శాశ్వతంగా వారి నుంచి దూరం చెయ్యడం


మర్చిపోకు మిత్రమా వయసు శాశ్వతం కాదు

పండు ఆకు పడుతుంటే పచ్చి ఆకు పక్కున నవ్వుతుంది

దానికి తెలియంది ఏమిటంటే త్వరలో నాకు వయసు వస్తుంది అనే విషయం.......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract