బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

4.9  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

యవ్వన బలి

యవ్వన బలి

6 mins
461


బాల్కనీ లో కూర్చొని ఆలోచిస్తున్న వర్షా కి ...ఒక్క సారి గా కడుపులో మెలిపెట్టీ తిప్పి నట్లు అనిపించింది...నోరు అంత పుల్లగా ఉప్పగా అయిపోయి.... వాంతు అవ్వబోతు వుంటే.బలవంతం గా వాంతూ నీ అపుకొడనికి ప్రయతినిస్తు...నోటికి చేతి నీ అడ్డు పెట్టు కొని.... గబా గాబా.....వాష్ బేసిన్ దగ్గరకి పరుగు తీసింది..... అంతా అలిసిపోయినట్లు అనిపించే సరికి రూం కి వచ్చి అలానే పడుకుంది .....


మళ్లీ సాయంత్రం రాజేష్ అఫీస్ నుంచీ వచ్చి డోర్ లాక్. చేస్తే గాని లేవలేదు....అప్పుడు కూడా....లేవడానికి ప్రయత్నం చేసిన శరీరం సహకరించడం లేదు....లేని బలాన్ని కూడా తెచ్చుకొని....రోజు తను మోసే శరీరం వేరే ఎవరిదో 100 కేజీ ల బరువు వున్న వారి శరీరం ల అనిపిస్తూ వుంటే....బలవంతం గా ముత పడుతున్న కనులను బలవంతం గా తెరుస్తూ....5 అడుగుల దూరం లో వున్న డోర్ దగ్గరికి 5 కిలో మీటర్లు పొడవు అన్నట్లు అనుకుంటూ....చివరికి చేరి తలుపు తీసింది...


రేగిన జుట్టు.....అస్త వ్యస్తం గా వున్న చీర....నీరసం నిస్సత్తువ చేరువైన తనను చూసి...ఒక్క సారి గా రాజేష్ కంగారు పడి....వెంటనే లోనికి వచ్చి డోర్ వేసి తనను పట్టుకున్నాడు....


నిలబడ డానికి ఒక ఆధారం దొరికింది అని అన్నట్లు రాజేష్ పై వాలి పోయింది వర్షా...


ఎం అయింది వర్షా....నేను ఆఫీస్ కి వెళ్ళే అప్పుడు బాగానే వున్నావు గా... మరి ఎం అయింది....


ఏమో అండి...ఒకటే వాంతులు.... నిల్లుతాగినా అవుతున్నాయి....యిప్పటికీ ఒక 10సార్లు అయ్యాయి కావచ్చు....మాట్లాడ లేక....చిన్న స్వరం తో ఉపురి వదులుతూ చెప్పింది...


పక్కనే వున్న సాఫా లో వర్షా నీ కూర్చో బెడ్తు....

ఎంటి వర్షా....అంతలా అయితే కనీసం ఫోన్ అయిన చేయకూడదు....అంత పరాయి వాడిన...ఒంటరిగా వున్నావు...ఎం అయిన అయితే....నేను ఎం అయిపోవాలి చెప్పు.....వుండు హిస్పిటల్ కు వెళదాం....నేను రెండు నిమిషాల్లో రెఢీ అయ్యి వస్తా...అని బాత్ రూమ్ లోకి వెళ్ళాడు రాజేష్...


అప్పటి నుంచి అలసట తో తను ఆలోచించలేదు...ఒక్క సారి గా తనకు వచ్చిన ఆలోచన నిజం కాకూడదు అని మనసులో అనుకుంటూ గోడ కు తగిలించి వున్న క్యాలెండర్ దగ్గరికి వెళ్ళింది....పెళ్లి జరిగి నిన్నటి కి 3 నెలలు....పెళ్లి అయినప్పటి నుంచీ నెలసరి ఒక్క సారి కూడా కాలేదు.... ఇది అది అయితే కాదు గా..ఆలోచిస్తూ వుంటే వొళ్ళు అంతా చమటలు పట్టేసాయి .....


వర్షా....ఎం ఆలోచిస్తున్నావు....చీర కాస్త సర్ధుకో...వెల్దాం హిస్పిటల్ కు....


తను పడుతున్న టేంక్షన్ ను కనపడనియకుండ ....పర్లేదు రాజేష్....కాస్త అజీర్తి చేసింది...అంతే.....


తనని మాట్లాడనీయకుండా.....నోటి ముందు తన చేయి అడ్డు పెట్టీ.... హ్మః.... చాలు లే పదా....


చేతిని పక్కకి జరిపి ...ప్లీస్ రాజేష్....చెపితే ఎందుకు వినవు అంటూ....సోఫాలో కూర్చుంది...


మెల్లిగా తన పక్కన కూర్చుని....ప్లీస్ నా కోసం....నికు ఎం అయిన అయితే నేను తట్టుకోలేను వర్షా....నికు ఎం కాకుండా చూసుకుంటా అని చర్చ్ లో ప్రమీసే చేసి పెళ్లి చేసుకున్న....యిప్పుడు నువ్వు ఇలా అంటే....అని చిన్నబుచ్చుకున్నడు....


ఎం చేయాలి అర్థం కాలేదు....వర్షా కి....సరే అని పక్కకు వున్న....రాజేష్ మాటి మటి కి అడుగుతూ వుంటే....వెల్ల క తప్పలేదు ....


ఎందుకు అయిన మంచిది అని ...తన స్నేహితురాలి అమ్మ డాక్టర్ కాబట్టి తన దగ్గరికి వెళ్ళాలి నిశ్చయించుకుంది....


డాక్టర్ అన్ని టెస్టులు రాసి వాళ్ళిద్దర్నీ కాసేపు బయట కూర్చోమనీ చెప్పింది.....


రాజేష్ కు ఫోన్ రాగానే తను నేను ఇప్పుడే వస్తానని బయటికెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు...


పక్కనే ఉన్న చైర్ లో కూర్చుని ఉన్న వర్షాకి డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పింది నర్స్.....


ఫోన్ మాట్లాడుతున్న తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని......అంతే కాక నిజం ఎంటో ముందు తనకి తెలియకపోవడమే మంచిది అని... వర్షా ఒకతి లోపలికి వెళ్ళింది....


స్నేహితురాలి అమ్మ కాబట్టి వర్షాన్ని ఆప్యాయంగా పలకరించి..... కూర్చో అని చెప్పింది....


సారీ అమ్మ ఏమి అనుకోకు వర్క్ బిజీ వల్ల నీ పెళ్లికి రాలేకపోయాను..... ఎనీవే కంగ్రాట్యులేషన్స్....త్వరలోనే నన్ను అమ్మమా నీ చేయబోతున్న వు....


అది విన్న వర్షం ఒక్కసారిగా నో....ు అని గట్టిగా అరిచింది...


వాట్ హప్పెన్ వర్ష ఏమైంది.......అందరు తల్లి అవుతున్నావు అని చెబితే సంతోషిస్తారు నువ్వు ఎందుకు ఇలా నో... అని అరుస్తున్నావ్...


ఆంటీ నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు దయచేసి ప్రెగ్నెన్సీ తీసేయండి అని ఏడుస్తూ కూర్చుండిపోయింది....


వాట్ హప్పెండ్ వర్ష అసలు ఏమైంది నాకు విషయం ఏంటో చెప్పు.....


వర్షా మౌనాన్ని చూసి కాసేపు అగి.... సాయంత్రం ఇంటికి రా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పింది.....


నీ మౌనం నాకు అర్థం అయింది....మీ ఫ్రెండ్ కూడా us నుంచి నిన్నే వచ్చింది.... అతని ని కలవడానికి అయినా రా....


వర్షా కి కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంది అందుకే ఇంటికి వెళ్లడమే మంచిది అనిపించింది....


నేను సాయంత్రం వస్తాను కానీ నేను ప్రెగ్నెంట్ అనే విషయం మా ఆయనకు దయచేసి ఇప్పుడు చెప్పకండి...


ఏదో చాలా పెద్ద విషయం అయ్యి ఉండొచ్చు అని డాక్టర్ మనసులో అనుకుంటూ సరే అని చెప్పింది......


...... ...... .............


ఆంటీ......


హూ హాయ్ వర్ష వచ్చావా... నీ ఫ్రెండ్ పైన ఉంది.... తన గదిలో ఉంది....యి ఇల్లు నికు కొత్తేం కాదు గా.....వెళ్లి మాట్లాడు....


ఒకే ఆంటీ అంటూ....గదిలో కి వెళ్ళింది.... వర్షా....


డాక్టర్ (అంటీ) వాళ్ళ గదిలో కి రావడం చూసి...వర్ష ఏడుపు ఆపి...కన్నిలు తుడుచుకుంది....


అది చూసిన అనిత(అంటి)....అమ్మ వర్ష ఎం అయింది....ఎందుకు ఏడుస్తున్నావు....నిజం చెప్పు....మీ ఆయన నిన్ను ఎం అయిన బాధపెడుతున్న డా...నాతో చెప్పు...ఎం అయింది.... నా వంతు సహాయం నేను తప్పకుం8డా చేస్తాను....


)అనిత అంటి కి చెప్పాలా వద్దా అని వర్ష ఆలోచిస్తూ వుంటుంది....తన మౌనం నీ చూసి...సరే అమ్మ నికు చెప్పాలని అనిపిస్తే నే చెప్పు...అని లేచి వెళ్లి పో బోతు వుంటే...


వర్షా అంటి చేయి నీ పట్టుకొని ఆపుతుంది....


చెప్పడం మెదలు పెట్టింది....అంటి చెప్పు అమ్మ అని అన్నట్లు తన పక్కన కూర్చుని తన చేయి పట్టుకుంది...


ఆంటీ మీకు తెలుసు కదా....మాది అదిలాబాద్ లో ఒక చిన్న గూడెం....బాగా చదువుతాను అని....నన్ను మొదటి సారి యింత దూరం పంపరు....మా గూడెం లో....అందరూ తో కలిసి బాబయి పిన్ని అక్క మామ అని పిలుస్తూ వరసలు కలుపుతూ మాట్లాడుకునే వాళ్ళం....కేవలం ప్రేమ అనురగలే తప్ప... మోసం,ద్వేషం ,కుల్లు కుతంత్రాలు లేని గూడెం మాది....అలాంటి వాతావరణ లో పెరిగిన నేను సిటీ కి వచ్చాక యిక్కడ కూడా అందరూ అలానే వుంటారు అని పొరపాటు పడ్డాను....పై కి మంచి గా వుంటూ....లోపల ద్వేషం పెంచుకుంటారు అని ఊహించలే దు నేను....


నేను డిగ్రీ మొదటి సంవత్సరం లో చేరక....నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు....పల్లెటూరి మొద్దు నీ...అందరూ మంచి వారే అని అనుకొనే దాన్ని....గొఱ్ఱ కసాయి వాడిని నమ్మినట్లు నేను వాడిని నమ్మి మోసపోయ....


తుంటరి వయసు....తను ప్రేమిస్తున్న అని చెప్పా గానే....మనస్సు పరుగులు తీసింది....డబ్బు వున్న పట్నం వాడు.....బైకు ల పై తింపడం.... మల్టీ ప్లెక్స్ లకు....షాపింగ్ మాల్స్ కు....బర్త్డే డే కానుకలు ఇచ్చి....నన్ను తన వలలో వేసుకున్నాడు ...స్నేహితులు వత్తాసు పలికారు.....యివన్నీ ప్రేమతో చేస్తున్నాడు అని నేను మురిసి పోయా....కానీ నా మనస్సు నీ కాకుండా నా శరీరం నీ ఆశ పడ్డాడు....ఒక రోజు వాళ్ళ అమ్మ వాళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్పి సాయంకాలం ఇంటికి రమ్మని అన్నాడు....ఎలాగూ చదువు అయిపోయింది....పరిచయం చేస్తే నన్ను ఒప్పు కొగనే....గూడెం కు వెళ్లి అమ్మ నాన్న క్కి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కలలు కంటు కాబోయే అత్త గారు అని వెళ్ళాను....కానీ....వాళ్ళు ఎదో ఫంక్షన్ కి వెళ్ళారు ఒక గంట లో. వచ్చేస్తారు అప్పటి వరకు కూర్చో అని జుసే ఇచ్చాడు....మూడు సంవత్స రాలు పరిచయం ...ప్రేమ అనే ముసుగు..

.అనుమానం లేకుండా తాగేసను...


.లేచి చూసే సరికి నా వొంటి పైన ఒక్క నులి పోగు కూడా లేదు....గదిలో ఉన్న అద్దం లో చూసే సరికి ఒంటి పై గాట్లు....అక్కడే మూలన ఉన్న నా డ్రెస్ వేసుకొని అలిసిన శరీరం తో బరువెక్కిన హృదయంతో తలుపు తీసాను....ముందు గదిలో ముగ్గురు అబ్బాయిలు....అర్ధ నగ్నంగా,....


ఎందుకు ఇలా చేశావ్ అని నిలదీస్తే.....నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నవు....అని ఎగతాళి చేశాడు.....కాళ్ళు పట్టుకొని బతిమిలాడ....చి పో అని అన్నడు...


బాధ తో ....ఇంటికి వచ్చిన నాకు.....అమ్మ వాళ్ళకి విషయం చెప్పే లోపే పెళ్లి సంబంధ....కనీసం నన్ను చేసుకునే వాడికి అయిన చెబుదాం అని అనుకునే లోపే పెళ్లి కూడా అయిపోయింది....పెళ్లి అయ్యాక చెప్పుధం అని అంటే.....బయం తో మనస్సు చెప్పిన మాట నీ మెదడు వద్దు అని అంటూ వుంటే ....యి సమయం లో నే ఇలా ప్రెగ్నెన్సీ....


అని...మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది వర్ష....


ఇది విన్న అనిత కి ఎం చేయాలి తోచలేదు....

నువ్వు బయపడకు అమ్మ....అంత మంచే జరుగుతుంది....వారి వల్ల అని నువ్వు అనుకుంటున్నావు కదూ...మీ పెళ్లి అయ్యి 3 నెలలు అవుతోంది...యిప్పుడు నీకు మొదటి నెల గడిచింది అంతే.... రెండో నెల రెండో వారంలో వుంది ఇది మీ సంతానమే...నువ్వు బయపడ వలసిన అవసరం లేదు....


ఆ మాట వినగానే వర్ష కి ప్రాణం లేచి వచ్చింది.....


నిజమేనా....అని పదే పదె అడిగింది... నా కడుపులో.ఆ దుర్మార్గుల రూపం ఊపిరి పోసుకుంటుంది అని బయపడి పోయా ....థాంక్స్ మేడం.... నా మనసుకి మీరు ఎంత ప్రశాంత త నీ ఇచ్చారో చెప్పలేను....ఎన్ని లక్షలు ఇచ్చిన ఇంత శాంతి లభించదు....డబ్బు తో కొనలేని అమూల్య మయిన వాటిలో ఇది కూడా ఒకటి....

యిక వెళ్లి వస్త అంటి....మార్కెట్ కి అని చెప్పి వచ్చా....లేట్ అయితే కంగారు పడతారు....ముందు గా వెళ్లి ఆయన తండ్రి కాబోతున్నారు అని చెప్పాలి....


అని ఆశీర్వాదం తీసుకోని.....చిరు నవ్వు తో బయలుదేరింది వర్షా.....



..... ....... ....... ...... ....


అమ్మ....తనతో అల ఎందుకు చెప్పావు.....


ఒక్క వారం తేడా తో చెప్పాను.....తనకు వచ్చిన ప్రెగ్నెన్సీ పెళ్లి కి వారం రోజుల క్రితం జరిగిన అనర్థం వలన వచ్చిందా....లేక అయన భర్త వలన అనేది తెలుసుకోవడం చాలా కష్టం.....అది తెలుసుకొనే ప్రయత్నం లో బార్య బర్త ల మధ్య ఇబ్బందులు ఎదురు అయ్యే అవకాశం ఉంది.....ముందే తను చాలా డిప్రెషన్ లో వుంది.... ఇలాంటి సమయం లో ఆ నిచుల వలన అని తెలిసిన తనను తాను నిజం దాచి నందుకు.....చదుకోమని పంపితే....ప్రేమ పేరుతో ఒకరీ వద్ద మోస పోయి....తన కన్న వారిని మోసం చేసా అని ఆలోచనలో పడిపోయి....ఎం అయిన అనార్ధనికి పాల్పడే అవకాశం ఉంది.....తన భర్త తో ఇక ఉండలేను అని పుట్టింటికి వెళ్ళిన....ఈ విషయం బయటకు వెళితే....ఈ సమాజం తప్పు తనది కాకున్నా...తనని సూటి పోటి మాటలతో హింసిస్తూ బ్రతక నివ్వదు ....అందుకే ఇలా చేశాను...దిని వలన తనకి అయ్యే నష్టం కన్న మంచి ఎక్కోవా అని నా అభిప్రాయం....


ఒక డాక్టర్ గా...ఒక సైకాలజిస్ట్ గా...నేను నా జీవిత కాలం లో చాలా మంది అమ్మాయిలను చూసాను....కొందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ లకు వెళ్ళడం....కొందరు ప్రేమ అనే ముసుగు లో తప్పులు చేసి తరువాత అది ప్రేమ కాదు అని తెలిసి విడిపోవడం..... లివింగ్ రిలేషన్ అని....అనేక వింత పేర్లతో.....జీవితం నాశనం చేసుకుంటున్నారు...యవ్వనం ఒక వరం ....దానిని ఈ విధంగా వ్యర్థం చేసుకుంటున్నారు.....వారు ఎం కొల్పుతున్నరో వారికి అర్థం అయ్యే లోపు....ఆ కాలం చేజారి పోతుంది.....


రెండు రోజుల క్రితం...ఒక అమ్మాయి హాస్పిటల్ కి వచ్చింది....తను హాస్టల్ లో వుండి చదుకుంటుంది.....అమ్మ వాళ్ళకి తెలియకుండా ఒక అబ్బాయితో పారిపోయింది.... వాళ్ళ నాన్న మాట్లాడినట్లు....హాస్టల్ వార్డెన్ తో మాట్లాడించి ఫోన్ లో....

వెళ్ళిపోయాక కానీ అర్థము కాలేదు తనకు తను ప్రేమించింది మనస్సు ను కాదు....శరీర ము నీ అని....అంతే కాదు...ఎలా అయిన బ్రతక వచ్చు ప్రేమించిన వాడు వుంటే అనుకొని వెళ్ళింది....యిల్లు చక్కబెట్టడం అంటే మాటలు కాదు అని అర్థం అయింది....అంతే కాదు ఆ అబ్బాయి మరో అయిదు ఆరు మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని....చివరికి ఒక స్నేహితరాలు సహాయం తో....ఇంటికి వెళ్లి వచ్చినట్లు వార్డెన్ దగ్గర....ఎక్కడికి పోలేదు అని అన్నట్లు ఇంట్లో మ్యానేజ్ చేసింది....కానీ చేసిన పాపం ఎక్కడికి పోతుంది....ప్రెగ్నెన్సీ రూపం లో బయట పడింది....మీరే సహాయం చేయాలి అని కాళ్ళ మీద పడి ఏడిచింది.....


ఇలాంటివి కొన్ని వందల కేసులు రోజు వస్తుంటే ...గుండె బారం అవుతుంది....యువత ఎందుకు ఇలా అవుతుంది అని....


గుండె బారం తో ... దీర్ఘం గా శ్వాస తీసుకోని....తన గదికి వెళ్లిపోయింది....అనిత అంటి....


🙏🙏🙏🙏🙏


తప్పులు వుంటే ధయాచేసి మన్నించి.....మీ అభిప్రాయాన్ని తెలియజేయండి....దయచేసి ఎవరిని ఉద్దేశించింది కాదు...కొందరి గురించి వార్తల్లో చుట్టూ సమాజం లో చూస్తున్న కొన్ని అంశాల ఆధారంగా రాశాను ....మీ మనసుని నొప్పిస్తే మన్నించాలి....




Rate this content
Log in

Similar telugu story from Drama