Latha Murty Palagummi

Drama

3.8  

Latha Murty Palagummi

Drama

వసంతాగమనం

వసంతాగమనం

1 min
383



శీర్షిక: వసంతాగమనం


ఏంటి!? పిల్లాడు నచ్చాడా... లేదా!? ఏదో ఒకటి చెప్పి ఏడువు ... ఇప్పటికి మధ్య వర్తి నుండి ఎన్నిఫోనులో!? లక్షణమైన సంబంధం... కుర్రాడు బంగారంలా ఉన్నాడు... మంచి ఉద్యోగం... ఇంకేంకావాలి నీకు... ఈ సారి మాత్రం నువ్వు పెళ్లి కొడుకుతో విడిగా మాట్లాడేది లేదు... విన్నావా!? అలాదెయ్యం పట్టిందానిలా కూర్చోకపోతే ఏదో ఒకటి చెప్పి తగలడు...అని కూతురు చైత్ర మీద తిట్లవర్షం కురిపిస్తోంది శారదమ్మ. 


పెళ్లి వాళ్ళు  వెళ్లిన దగ్గర నుండి మౌన వ్రతం చేపట్టింది చైత్ర.


ఈలోపు చైత్ర వాళ్ళ మేనత్త వస్తూనే పరిస్థితి అర్ధం చేసుకుంది ... 


బెనారస్ జార్జెట్ ఆరంజ్ కలర్ కి బ్రౌన్ బోర్డర్ శారీలో... చీర కొంగు దోపుకుని సీరియస్ గా ఉన్నవదిన మోహం చూస్తేనే తెలుస్తోంది చైత్రకి క్లాస్ పీకుతోందని... త్వరగా తను సీనులోకి  ఎంటర్అయిపోవాలి, లేకపోతె దాని తల బొప్పి కడుతుంది  అనుకుని...

ఏమంటోంది వదినా అది... ఏమైనా చెప్పిందా!? అంటూ ఎంటర్ అయిపోయింది.


"నువ్వే కనుక్కో శ్రావణి... నీ ముద్దుల మేనకోడలిని... నా వల్ల కావడం లేదు... బెల్లం కొట్టినరాయల్లే కూర్చుంది ఉలుకూ పలుకూ లేకుండా... దాన్ని చూస్తుంటే మండిపోతోంది నాకు...


మూడేళ్ళ నుండి సంబంధాలు చూస్తున్నా దీని పెళ్ళి చేయలేకపోతున్నాం... దాని నెత్తి మీద  నుండి నిజం చెప్పాలనే భూతం దిగేంతవరకు ఏ సంబంధమూ కుదరదు... నచ్చ చెప్పుదానికి...ఉన్న ఒక్కగానొక్క కూతురి పెళ్లి చేయలేక పోతున్నారని ఊరిలో జనాలు నవ్వుకుంటున్నారు... 


ఇప్పటికిది ఎన్నో సం..బం..ధం!? నీకు తెలియనిది  ఏముంది!? ఎక్కే గడప, దిగే గడప మీఅన్నయ్యది మూడేళ్ళుగా...అంది దుఃఖంతో గొంతు పూడుకుపోగా.


"నువ్వు ఊరుకో  వదినా... నీ కసలే హై బీ. పీ..." అని ఆవిడని బలవంతంగా అక్కడి నుండిపంపేసి మెట్ల మీద అలిగి కూర్చున్న మేనకోడలు పక్కన కూలపడింది శ్రావణి.


ఏమైందిరా తల్లీ!? చెప్పు! కుర్రాడు నచ్చ లేదా!? అని బుజ్జగిస్తూ అడిగింది..


చిన్నప్పటి నుండి అత్త దగ్గర బాగా చనువు చైత్రకి. ఇద్దరూ స్నేహితుల్లా ఉంటారు.


"అన్నీ తెలిసి అదేం ప్రశ్న అత్తా!?

అతనికేం... చాలా బాగున్నాడు... 

అమ్మ వాళ్ళు అసలు విషయం దాచి పెళ్లి జరిపించేద్దాం అనుకుంటున్నారు... తర్వాత అయినావాళ్ళకి తెలీదా!? ఏమన్నా అంటే పాతిక ఎకరాల  పొలం ఇస్తున్నాము... ఎన్ని జన్మలెత్తితేసంపాదించాలి!? అంటారు... పొలం చూసి కాదు... నన్ను నన్నుగా ఇష్టపడే వ్యకి కావాలి అత్తానాకు... వంద అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయాలనే చెత్త సామెత ఒకటి చెప్తారు... ఎంతచిరాకో నాకు" అంది ఉడుకుమోత్తనంగా. 


నేనతన్ని ఎలాగయినా కలిసి మాట్లాడాలి... తర్వాతే పెళ్లి... అని ఖండితంగా  చెప్పింది చైత్ర.


అమ్మ తో తగాదా పడొద్దని...ఆ ఏర్పాట్లేవో తను చూస్తానని భరోసా ఇచ్చింది శ్రావణి.


ఇరువైపుల వారి గ్రీన్ సిగ్నల్తో  పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ప్రారంభమయ్యాయి.


వీధి వీధి అంతా పందిరి వేశారు... పూల డెకొరేషన్... భాజా భజంత్రీల మధ్య మొగ పెళ్లి వారురావడం... బంగారు బొమ్మ రావమ్మా!! అని భజంత్రీలు మోగిస్తుండగా... ఎర్రని కంచి పట్టు చీరలో, ఒంటి నిండా నగలతో ముగ్ధ మనోహరంగా మెరిసి పోతున్న చైత్రని మేనమామలు అపురూపంగాబుట్టలో తీసుకువచ్చారు.


"పెళ్లి కొడుకుని  చూసి ఎంత అందగాడో... అని అందరూ పొగడడం... ‘మేడ్ ఫర్ ఈచ్ అథర్‘ లాఉన్నారని కొందరు... అందంలో ఇద్దరూ పోటా పోటీలు పడుతున్నారని మరి కొందరు తెగ మెచ్చుకుంటున్నారు."


"ఇంతలో ఎవరో... చైత్ర అదృష్ట వంతురాలే... పోలియో అయినా మంచి మొగుడు దొరికాడు అనిఅనడం పెళ్లి కొడుకు తల్లి చెవిన పడింది."


"అంతే... పెద్ద విస్పోటకం    అయినట్లయింది...


పచ్చి మోసం... దగా... అన్న ఆమె అరుపులకి ఒక్కసారిగా భాజా భజంత్రీలు ఆగిపోయాయి... 


ఎక్కడ చూసినా గుసగుసలు... పిల్ల కుంటిదని చెప్పకుండా పెళ్లి కుదుర్చుకున్నారట  అని..."


"పెళ్ళి చూపుల్లో ‘పిల్ల కుంటుతోందేమిటని అడిగితే కాలికి దెబ్బ తగిలిందని అబద్ధం చెప్తారా‘ ఎంత మోసం!?

లేరా... వసంత్! కుంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన ఖర్మేమీ పట్టలేదు నీకు... అని పెళ్లి పీటలమీద నుండి కొడుకుని లాక్కెళుతోంది అతని తల్లి..."


చైత్ర తల్లి తండ్రులు, పెదనాన్న, అత్త అందరూ  ఆవిడ కాళ్ళా వేళ్ళా పడుతున్నారు పీటల మీదపెళ్లి ఆప వద్దని ప్రాధేయపడుతున్నారు.


చైత్రకి ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు... తన జీవితంలో ఏది జరగకూడదని అనుకుందోఅదే జరుగుతోంది... మనసు పిండేసినట్లు ఎంతో బాధగా ఉందామెకి.


చైత్ర కళ్ళ నిండా నీళ్లు... అతను కళ్ళతోనే ధైర్యం చెప్పాడు నేను చూసుకుంటానని.


"తనకి పోలియో ఇష్యూ ఉందని  చైత్ర ముందే చెప్పింది అమ్మా నాకు... మీకు కూడా అంగీకారమైతేనే ఈ పెళ్లి జరుగుతుందని, తనే వచ్చి మీతో మాట్లాడతానంటే వద్దని...... నేనే చెప్పిఒప్పిస్తానన్నాను.


మీరెక్కడ వద్దంటారోనని భయమేసి 

చెప్పలేదు...


తన స్వచ్ఛమైన మనసు నచ్చింది నాకు... తనని మొదటిసారి చూసినప్పుడే చేసుకుంటే ఈఅమ్మాయినే చేసుకోవాలి అనుకున్నాను... ఇందులో వాళ్ళ తప్పేమి లేదని తల్లి తండ్రులకి నచ్చచెప్పాడు.


కొడుక్కి ముందే తెలిసి ఒప్పుకున్నాడని తెలిసాక  కాస్త చల్లబడ్డారు వాళ్ళు కూడా. కొడుకు ఏదైనానిర్ణయం తీసుకుంటే ఎంతో ఆలోచించి గాని తీసుకోడని నమ్మకం ఆవిడకు.


కాసేపటికి అందరూ సర్దుకుని

అనుకున్న ముహూర్తం టైముకే 

"మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా" అని  శ్రావ్యంగా భజంత్రీలు మోగిస్తుండగావసంత్  చైత్ర మెడలో మూడు ముళ్ళు వేశాడు.


శారదమ్మ కన్నీళ్లతో  కూతురికేసి మెచ్చుకోలుగా చూసి "తన మంచి మనసే తనకి శ్రీ రామ రక్ష  " అయిందనుకుంది. 


చైత్ర మాసంలో వచ్చే వసంతంలా వసంత్  జీవితంలోకి అడుగుపెట్టింది చైత్ర.


సమాప్తం

            


***********


Rate this content
Log in

Similar telugu story from Drama