Latha Murty Palagummi

Inspirational

4  

Latha Murty Palagummi

Inspirational

పునర్జన్మ

పునర్జన్మ

1 min
341



పునర్జన్మ


అదొక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్... ఐ. సీ. యూ. లో ఆపరేషన్ థియేటర్ బయట  నర్సులుహడావిడిగా అటు ఇటు పరుగెడుతున్నారు. ఆరడుగుల ఆజానుబాహుడు... ఏ 

పరిస్థితుల్లోనూ తొణుకు బెణుకు లేని వ్యక్తి ... ఆ ఊరిలో  పెద్ద బిజినెస్  మాగ్నెట్, రాజకీయాల్లోమంచి  వ్యక్తి గా పేరున్న రఘురామ్ గారు కండువాతో  నుదుటిన పట్టిన చెమటని మాట మాటకుతుడుచుకుంటూ అసహనంతో క్యారిడార్లో అటు ఇటు పచార్లు చేస్తున్నారు. 


అప్పటికి రెండు గంటల నుండి టెన్షన్ పడుతూ అవిరామంగా నడుస్తున్న ఆయనని కూర్చోమనిచెప్పే ధైర్యం కానీ, చనువు కానీ లేదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరికి. నర్సులనడిగి వాకబుచేసిన విషయాలనిబట్టి.... ఘోరమైన రోడ్ యాక్సిడెంట్ కి గురి ఐన 

ఆయన కొడుకు విక్రమ్ , కోడలు రజనిల పరిస్థితి సీరియస్ గా ఉందని వాళ్లలో వాళ్ళే  గుసగుసలాడుకుంటున్నారు. 


ఆపరేషన్ థియేటర్ లోంచి బయటకు వస్తున్న డాక్టర్  సుధాకర్ ని చూసిన రఘురామ్ గారు ఒక్కఉదుటున అతన్ని చేరి 

“సుధా, ఎలా ఉందిరా వాళ్ళిద్దరికి!? ఏమీ  ప్రాణాపాయం లేదు కదా!? ఎంత డబ్బైనాగుమ్మరించు... స్పెషలిస్టులని పిలిపించు... వాళ్ళిద్దరినీ మాత్రం కాపాడు” అని ఎంతో ఆత్రుతతొ, ఆందోళన నిండిన స్వరంతో అన్నారు రఘురామ్ గారు. 


సుధాకర్, విక్రమ్ చిన్న నాటి స్నేహితులు కావడంతో రఘురామ్ గారంటే వల్లమాలిన అభిమానంఅతనికి. ఆర్ధికంగా ఎన్నో సహాయాలు పొందాడు ఆయన నుండి.


“సారీ అంకుల్!! ఇప్పుడే ఏమీ చెప్పలేము...ఇంకా నాలుగైదు గంటలు పట్టొచ్చు...స్పెషలిస్టులనిపిలిచాము.. “దే ఆర్ ఆన్ ద వే” ప్లీజ్ అంకుల్ !! మీరు టెన్షన్  పడకండి. ఇప్పటికే చాలా టైర్డ్ గాఅనిపిస్తున్నారు  కాసేపలా కూర్చోండి” అని చెప్పి ఖంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు... 


ఇంకా అక్కడే ఉంటే ఆయన్ని ఫేస్ చేసే ధైర్యం లేక.. “గుండె దిటవు చేసుకుని విక్రమ్ ఇంక మనకిలేడని చెపుదామని బయటకి వచ్చిన అతను రఘురామ్ గారి ముఖం చూసి చెప్పలేక 

పోయాడు”. ఆయనకి  కొడుకంటే ఎంత పంచప్రాణాలొ తెలుసు అతనికి. 


సుధాకర్ వాడిన మొహం, మాటలో తొట్రుపాటు చూడగానే రఘురామ్ గారి మనసు ఏదో కీడునిశంకించింది.


అయ్యో!! నేను  వెళ్ళవలసిన ఫంక్షన్ కి అనవసరంగా వాళ్ళని పంపించానే.. వాళ్ళ కేదైనాజరగరానిది జరిగితే  నాకు ఈ జీవితంలో క్షమ లేదు అని తనని తాను ఎన్నో సార్లునిందించుకుంటూ కూర్చున్నారు. 


ఆయన కొడుకు గురించిన ఆలోచనల్లో  మునిగి పోయారు. విక్రమ్ లండన్ లో ఎం.బి. ఏ  పూర్తిచేసుకుని  వచ్చాక అతనికి బిజినెస్ అప్పగించి తన సమయమంతా రాజకీయాలకి కేటాయించిప్రజలకు చేతనైనంత సేవ చేయాలనుకున్నాడు. తనతో వియ్యమందడానికి ఎంతో మంది ఆసక్తిచూపినా... కొడుకు మనసు నొప్పించలేక అతను ఎంతగానో ఇష్టపడిన రజనీని ఇచ్చి వివాహంజరిపించాడు...ఆమె అనాథ  అని తెలిసినప్పటికి.


సుమారుగా రెండు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన సుధాకర్రఘురామ్ గారి వద్దకు వచ్చి కూర్చుని మంద్ర స్వరంతో " సారీ అంకుల్, ఐ కుడుంట్ సేవ్ విక్కీ, బ్లడ్ లాస్, బ్రెయిన్ డెడ్ అవడంతో ఎంత ప్రయత్నించినా కాపాడలేక పోయాం" అని చెప్పడంతో  రఘురామ్ గారి కాళ్ళ క్రింద భూమి కంపించినట్లయింది. కుప్ప కూలి  పోయారు...ఆయన్ని  ఊరుకోపెట్టడం ఎవరి తరం కాలేదు.


రెండు రోజుల తర్వాత రజని 

స్పృహ లోకి వచ్చింది. ఆమెని చూద్దామని లోపలికి వెళ్లిన రఘురామ్ గారు ఖంగు తిన్నారుయాక్సిడెంట్ లో ఆమె కంటి చూపు పోయిందని తెలిసి. సుమారుగా ఒక నెల తర్వాత కోడలినిఇంటికి తీసుకు వెళ్లారు.


కొడుకు, కోడలు నవ్వులతో, పార్టీలతో ఎప్పుడూ కళ కళ లాడే ఇల్లు వెలాతెలా  పోయినట్లైంది. ఇంట్లో మనుషులు  ఉంటున్నారో లేదో అన్నట్లు నిశ్శబ్దం  తాండవించింది. 


ఒక మధ్యాహ్నం వేళ ఇంట్లో పనివాళ్ళందరూ  పెద్ద పెద్దగా అరుస్తుంటే మంచి నిద్రలో ఉన్నరఘురామ్ గారు ఉలిక్కిపడి లేస్తారు. అయ్యగారు!! అయ్యగారూ!! రజనమ్మ గారు ఆత్మ హత్యా  ప్రయత్నం చేశారని ఆయాసపడిపోతూ చెప్పాడు నౌకరు.


ఒక్క ఉదుటన లేచి పరుగెత్తారు ఆమె రూమ్ కేసి. నలుగురు 

మనుషులు గట్టిగా పట్టుకుంటే చేతికి  కట్టు కట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తోంది నర్సు. ఆమెని ఆపడంఎవరి తరమూ  కావడం లేదు.


"అమ్మా రజనీ!! ఏం పని ఇది” అన్న  రఘురాం  గారి గొంతు వినగానే మంత్రం వేసినట్లుగింజుకోవడం ఆపేసింది. అందరిని వెళ్ళమని సైగ చేసి ఆమె వెక్కి  వెక్కి ఏడుస్తుంటే ఆమె తలమీద చెయ్యి వేసి నిమురుతూ ఆమెని ఓదార్చారు. 


చిక్కి శల్యమైపోయిన కోడలిని చూసిన ఆయన మనసు ఆర్ద్రతతో నిండి పోయింది. ఇంటి నిండా  పనివాళ్ళు, నర్సు ఉన్నారు కదా  ఆమెని చూసుకోవడానికి అనుకున్నాడే కానీ ఆమెకిప్పుడు నాఅనేవాళ్ళ ప్రేమ, 

ఆప్యాయత కావాలని గుర్తించలేకపోయాడు... పెద్దవాడిగా, అనుభవజ్ఞుడిగా తనని తానుసంభాళించుకుని ఆ పిల్లకి ధైర్యం 

చెప్పవలసినది పోయి అన్నీ త్యజించి  చీకటి గదికే  పరిమితమైపోయి  ఎంత పొరపాటు పనిచేసాడు తను !? అని బాధ పడ్డారు. 


నేనెవరికోసం బ్రతకాలి అంకుల్!! చిన్నప్పటి నుండి అనాధ శరణాలయంలో ఎవరి ప్రేమకినోచుకోకుండా 

పెరిగిన నన్ను విక్రమ్ ప్రేమ సాగరంలో  ముంచెత్తాడు. అతను  లేడనుకుంటేనే మనసంతా చేదుగరళం మింగినట్లు అయిపోతోంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయినాయి. ఈ కష్టాలన్నీసరిపోవన్నట్లు ఆ దేముడు నా కంటి చూపు కూడా తీసేసాడు.


" ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎందుకు..ఎవరి కోసం బతకాలి!? దయనీయంగా అడిగిందిరజని.


రజనీ, సమస్యలు వచ్చినపుడు ఆత్మహత్య ఒకటే పరిష్కారమైతే

నేను ఇప్పటికి ఎన్నో  సార్లు ఆత్మహత్య చేసుకుని ఉండాలి. నా చిన్నప్పుడే తల్లి తండ్రులనిపోగొట్టుకుని తిని..తినకా  కష్టపడి పైకొచ్చాను. వివాహమై జీవితం ఆనందంగా గడుస్తోందిఅనుకునేలోగా మీ అత్తయ్య క్యాన్సర్ తో చనిపోయింది. 


మళ్ళీ జీవితం నిత్య పోరాటం...


ఇటు బిజినెస్, అటు చిన్న పిల్లాడి పెంపకం...


ఎంతో కష్టపడి  అపురూపంగా, ప్రాణాతిప్రాణంగా పెంచాను విక్కీని ... ఇప్పుడు  వాడినేపోగొట్టుకున్నాను. ఇంకేం మిగిలింది నాకు. జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను. నాకేమైనా అయితేనిన్నెవరు చుస్తారనే ఒక్క కారణంతో. 


కాలమే గాయాన్ని మాన్పుతుందమ్మా...

కొంచెం ఓపిక పట్టు.. నీ మనసుకి నచ్చ చెప్పుకో... అన్ని సర్దుకుంటాయని ధైర్యం చెప్పారు. 


ఆమెకి చెప్పినవన్నీ తనకి కూడా అన్వయించుకోవాలి అనుకుని మర్నాటి నుండే బిజినెస్వ్యవహారాలు చూసుకోవడం ప్రారంభించారు. రఘురామ్ గారు.


రజనికి బ్రెయిలీ లిపి నేర్పడానికి  టీచర్ ని అప్పాయింట్ చేశారు. 


రజనికి ఐ ఆపరేషన్ చేస్తే కంటి  చూపు  వస్తుందని తన కలీగ్ ఐ స్పెషలిస్ట్ చెప్పాడని... డోనర్కోసం  చూస్తున్నామనే

చల్లని వార్త  సుధాకర్ చెప్పడంతో రఘురామ్ గారు సంతోషపడతారు.


రజనీకి నలతగా ఉందని ఒకసారి సుధాకర్ ని రమ్మని కబురంపారు రఘురామ్ గారు. 


చెకప్ తర్వాత  ఆమె ప్రెగ్నన్ట్  అన్న 

శుభవార్త  వారి చెవిన వేసాడు  సుధాకర్.


రజని, రఘురామ్ గార్ల  జీవితాలలో ఈ  వార్త ఆశాకిరణంలా అనిపించింది.


    *************


Rate this content
Log in

Similar telugu story from Inspirational