Latha Murty Palagummi

Inspirational

3.1  

Latha Murty Palagummi

Inspirational

లాలస

లాలస

3 mins
248


ట్రింగ్ ... ట్రింగ్ ... ట్రింగ్ ... ట్రింగ్ ... అంటూ కాలింగ్ బెల్ఆగకుండా మ్రోగడంతో అంత అసహనంతో బెల్లుకొడుతున్నారెవరో అనుకుంటూ  చీర కొంగుతో చేతులుతుడుచుకుంటూ వెళ్లి తలుపు తీసింది శ్రీవల్లి. ఎదురుకుండా ఆడపడుచు లాలస... "ఏంటొదినా!! ఎన్ని సార్లుబెల్లు కొట్టాలి!? అంటూ" చిర్రు బుర్రు లాడుతూ 

లోపలికొ చ్చింది లాలస... క్రొత్తగా కాపురానికి వెళ్లినఅమ్మాయి చెప్పా పెట్టకుండా రావడం... అందునా ఎంతోకోపంగా ఉండటంతో 

కొంచెం టెన్షన్ గా అనిపించింది శ్రీ వల్లికి. ఒక్కర్తివే వచ్చావా!? అంది 

ప్రశ్నార్థకంగా... వెనకాల ఆమె భర్త శశాంక్ వస్తున్నాడేమోనని చూస్తూ. 


ఏం రాకూడదా!? అతను లేకుండా... చెప్పు... వెళ్ళిపోతాను అంది కోపంగా.


అయ్యో!! సారీ.. అలా అని కాదు అంటూ మంచి నీళ్లు తెచ్చి ఇచ్చింది శ్రీవల్లి.


వదిన సారీ తో కొంచెం శాంత పడింది లాలస. తన తప్పుఉన్నా లేకపోయినా ‘సారీ‘ చెప్పి ఇంట్లో వాతావరణం 

ప్లజెంట్ గా ఉంచడం పరిపాటే శ్రీవల్లికి. 


శ్రీకర్ లా ఫైనల్ ఇయర్లో, లాలస టెన్త్ క్లాస్ లో ఉండగా వాళ్ళ తల్లి తండ్రులు కార్ యాక్సిడెంట్ లోచనిపోయారు. 


ఉమ్మడి కుటుంబం కావడం వలన పిన్ని బాబాయ్ ల చల్లని నీడలో అన్నా చెల్లెలు మెల్లిగాకోలుకున్నారు. 


చెల్లి అంటే ప్రాణం శ్రీకర్ కి. దానికి తోడు సడన్ గా పేరెంట్స్ చనిపోవడంతో లాలసకి వాళ్ళు లేనిలోటు తెలీకూడదని ఆమె అడిగిందల్లా చేయడంతో మొండిగా తయారైంది. 


చెల్లి పెళ్లి అయ్యాకే తను వివాహం చేసుకుంటానని... వచ్చినామె చెల్లిని బాగా చూసుకుంటుందోలేదోనని శ్రీకర్ భయపడితే... ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్ల... సౌమ్య స్వభావం కలది... అనిపిన్ని బాబాయ్ లు నచ్చ చెప్పి శ్రీవల్లి తో వివాహం జరిపించారు. 


వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా

వయసుకి మించిన పెద్దరికంతో వ్యవహరించేది శ్రీవల్లి.


భర్త ఎలా ప్రేమగా చూస్తాడో తను కూడా అలాగే చూసేది లాలసని.


శ్రీ వల్లికి, లాలసకి వయసులో ఎక్కువ వ్యత్యాసం లేకపోవడంతో త్వరలోనే కలిసి పోయారు. 


లాలసకి ముక్క మీదే కోపం... ఎంత స్నేహంగా ఉంటుందో అంత లోనే ఎదో ఒక విషయానికి కోపంతెచ్చుకునేది. కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఆడపడుచంటే కొంచెం భయమే శ్రీవల్లికి. 

అందుకే ఆచి తూచి మాట్లాడేది.


"కాఫీ ఇవ్వు వదినా... తల బ్రద్దలైపోతోంది" అంది సోఫాలో కూలబడుతూ లాలస.


మనసులో ఆందోళనగా ఉన్నా అడిగే ధైర్యం చెయ్యలేక శ్రీకర్ కోర్ట్ నుండి వచ్చాక అడగవచ్చులేవిషయం ఏమిటో అని మిన్నకుండి పోయింది శ్రీవల్లి. 


శ్రీకర్ ఇంటికి వస్తూనే ఏమ్మా!! ఎలా వున్నావు!? ఇంట్లో అందరూ  కులాసానా!? శశాంక్ కి వీలుకుదరకపోతే నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి పికప్ చేసుకునే వాడిని కదా!! అంటూ సూటుకేసి లోబట్టలు తీస్తున్న చెల్లెలి కి ఎదురుగా కూర్చున్నాడు.


శశాంక్ కి వీలు కాకపోవడమేమి కాదు... పొగరు... అతని పేరెత్తావంటే ఊర్కోను అన్నయ్యా... అతనొక అమ్మకూచి... వేరే కాపరం పెడితే కానీ రానని అందరి ముందే చెప్పి వచ్చేశాను.. అప్పడివరకు ఇక్కడే... నేనాయింటికి వెళ్లే పని లేదు అంటూ అల్టిమేటం ఇచ్చేసింది లాలస. 


శ్రీకర్, శ్రీవల్లి ఆశ్చర్యం తో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. 


చెల్లెలి కోపం, తొందరపాటుతనం తెలుసు కాబట్టి మెల్లిగా బుజ్జగిస్తూ... "నీకు ముందే తెలుసుకదమ్మా ఉమ్మడి కుటుంబమని... అతని సంపాదనతోనే ఇల్లు గడుస్తుందని...నువ్వు అతన్ని ఇష్టపడి చేసుకున్నప్పుడు కొంచెం సర్దుకుపోవాలమ్మా" అన్నాడు.


ఆ... అలాగే... నీకేం తెలుసు ఆ ఇంట్లో ఉండే టార్చర్... తెల్లవారు ఝామున ఐదింటికిమొదలవుతుంది మా మరిది గుడ గుడ చదువుతో... టెన్త్ క్లాస్ చదువుతున్నాడు కదా!! మనసులో చదువుకునే అలవాటు లేదా పిల్లాడికి...


ఆరింటికి మా అత్తగారు గుడిలో గంటలు మాదిరి మోగిస్తూ పూజలు చేస్తుంటారు.. వీకెండ్ కూడాసెలవు ఇవ్వదా దేముడికి... వారమంతా అలిసి పోయినవాళ్లు కాసేపు పడుకుంటారని అయినాలేకుండా అగరవత్తులు ఘాటైన వాసనతో సుప్రభాతం చెప్తుందా విడ.. 

ఆ...ఇంకో జిడ్డు క్యారక్టర్ గురించి చెప్పాలి... అదే...మా ఆడపడుచు.. సినిమా కి వెళ్లినా వదలదు, మా కూడానే వస్తుంది. వీకెండ్ ఎక్కడికైనా సరదాగా వెళదామంటే రెండు తోకలు రెడీ.. వాళ్ళులేకుండా అడుగుపడదీయనకి. ప్రైవసీ అనే మాటే లేదా ఇంట్లో.. నేను కావాలనుకుంటే వస్తాడు.. లేకపోతే లేదు.. వాళ్ళ తోనే ఊరేగమను..అంది కోపంగా లాలస.


ముందే పరిస్థితి అంతా శశాంక్ ద్వారా తెలుసుకున్న శ్రీకర్...నీతో ఈ విషయాలన్నీ ఎప్పుడూ చెప్పకూడదనుకున్నా... కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు అంటూ...మా పెళ్ళైన కొత్తల్లో నువ్వుఒక్కదాన్ని పడుకోవాలంటే భయమేస్తోందని మా తోనే పడుకునేదానివి చాలారోజులు...గుర్తుందా!? ఎక్కడికెళ్లినా ముగ్గురం కలిసే వెళ్ళేవాళ్ళం. 

"లాలసని మా దగ్గర వదిలి మీ ఇద్దరూ సరదాగా వెళ్ళండిరా" అని పిన్ని ఎన్నిసార్లు చెప్పినా మీవదినే 

ఒప్పుకునేది కాదు...నువ్వు ఎక్కడ చిన్నబుచ్చుకుంటావోనని. నువ్వు ఎప్పుడూ మా ఇద్దరిమధ్యలో కూర్చోడానికే ఇష్టపడేదానివి.. మేము కూడా నిన్నెప్పుడూ చిన్న పిల్లలానే చూసాము. మా అన్నకి పిల్లలంటే ఇష్టం... నువ్వు డాక్టర్ కి చూపించుకో  వదినా అని నువ్వనడం చాలాసార్లు నా చెవిన పడింది... అప్పుడు కూడా బయట పడలేదు మీ వదిన.. పెళ్ళికి ముందే నీ పెళ్లిఅయ్యేంత వరకు మాకు పిల్లలు వద్దనుకున్నామన్న విషయం.. మాకు పిల్ల లు పుడితే మాకాన్సంట్రేషన్ అంతా వాళ్ళ మీదకు వెళితే నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని... పెళ్లి కిముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒక్కసారి కూడా కంప్లైంట్ చెయ్య లేదు మీ వదిన.. ఇదంతాఎందుకు చెప్తున్నా నంటే శశాంక్ కూడా నీకన్నీ ముందే చెప్పి చేసుకున్నాడు. ఏదీ దాచలేదు, మీఅత్తగారు వాళ్ళు చాల మంచివాళ్ళు.. వాళ్ళ మనసునొప్పించ వద్దు... అన్నాడు శ్రీకర్.


తన కోసం అన్నా వదినలు పిల్లల్ని కూడా కనకుండా ఉన్నారని తెలిసి నిర్ఘాంత పోయింది.. వదినని తను ఎన్ని సార్లు సూటి పోటీ మాటలందో గుర్తుకు వచ్చి వదిన వ్య క్తిత్వం ముందుచిన్నతనంతో సిగ్గుతో కుంచించుకు పోయింది. 


తను గొడవ పెట్టుకుని వచ్చిన విషయాలు చాలా సిల్లీగా అనిపించాయి. 


లాలస కళ్ళ వెంట నుండి కన్నీళ్లు ప్రవాహంలా వచ్చేశాయి. "సారీరా.. నిన్ను బాధ పెట్టాలనికాదమ్మా" అంటూ 

అన్నా వదినలు ఇద్దరూ ఇంకా తనని చిన్న పిల్లలా బుజ్జగిస్తుంటే వాళ్ళ ఔన్నత్యానికి సిగ్గుతోకుంచించుకు పోయింది. 

లాలస అన్నా వదినలకి మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలిపి... 

మొదటగా తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో తిరుగు ప్రయాణానికి సిద్ధ పడింది.. వదినలాగే తను కూడా పెద్దరికంతో వ్యవహరించి శశాంక్ కి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలనే దృఢనిశ్చయంతో. 


   ***********************


Rate this content
Log in

Similar telugu story from Inspirational