Latha Palagummi

Drama

4  

Latha Palagummi

Drama

మృగత్రుష్ట్న

మృగత్రుష్ట్న

3 mins
349



మృగత్రుష్ట్న


సాయం సమయం, కాలేజీ లో ఎక్కడ చూసినా సందడే.

“అందరూ ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉంటే ఈ సరూ మహాతల్లి ఎవరికి సహాయం చేస్తూఎక్కడుందో, ఏమో అని అసహనంగా వెతుక్కుంటూ ఎదురుపడ్డ స్నేహుతులనందరిని ‘సరూనిఎక్కడైనా చూసారా!?’ అని అడుగుతూ 

వెళుతుంది వైభవి”.


ఇప్పుడే లైబ్రరీలో చూశానని ఒకతను చెప్పడంతో వడివడిగా అడుగులు వేసుకుంటూ అటుకేసివెళ్ళింది.


లైబ్రరీలో సరస్వతి ఓ మూల కూర్చుని సీరియస్ గా పని చేసుకుంటోంది.


“సరూ!! అవతల బస్సు కి లేట్ అయిపోతుంటే నువ్వేమో తాపీగా ఇక్కడున్నావా!?” అందికోపంతో గట్టిగా. 


హుష్!! మెల్లిగా మాట్లాడు.. ఇది లైబ్రరీ... కాసేపట్లో ఐపోతుందిలే

కూర్చో..వెళదాము అంది ప్రశాంతంగా.


“నువ్వు ఆల్రెడీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసావు కదా !? ఇది ఎవరిదీ!?” అని అడిగింది వైభవి కొంచెంకోపంగా.. 


సురేష్ ది.. అని సరస్వతి చెప్పడంతో ఒళ్ళు మండిపోయింది వైభవికి.. 


వాడేమో అక్కడ కాంటీన్లో కూర్చుని ఫ్రెండ్స్ తో సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నాడు..


నువ్వేమో వాడి కోసం కష్ట పడుతున్నావా..అంటూ కోపంతో చార్ట్ లాగి పాడేసింది సరస్వతి చేతిలోనుండి.


అబ్బా.. పొనీలే పాపం.. హెల్ప్ చేయమని అడిగాడే!చేస్తానన్నాను.. ఈ సారికి వదిలేయ్.. ప్లీజ్, అందరూ ఇటే చూస్తున్నారు.. ఇచ్చేయ్..అంటూ బ్రతిమాలి చార్ట్ వెనక్కి తీసేసుకుంది.


“మెతక వాళ్ళని చూస్తే మొట్ట బుద్ధి అవుతుందన్నట్లు” అందరూ నిన్ను వాడుకుంటున్నారుఅంటూ అసహనంగా కూర్చుంది వైభవి. 


బుక్ రీడింగ్ బోర్ అని భావించే  వైభవి..ఎంతో దీక్షగా పని చేసుకుంటున్న సరస్వతి కేసే చూస్తూఆలోచిస్తోంది.. 


నల్లగా ఉన్నా చక్కటి కళ గల ముఖ కవళికలు.. పెద్ద జడ.. సీదా సాదా వస్త్ర ధారణ కలిగినసరస్వతిని చూస్తే ఎవరూ అనుకోరు ఆమె కోటీశ్వరుల బిడ్డ అని.


ఒకసారి తనకేసి చూసుకుంది వైభవి.. పేరులో వైభవమే కానీ జీవితంలో లేదు.


నలుగురు అక్కచెల్లెళ్ళు.. ఉన్నవి పది జతల బట్టలు, ఒక సంవత్సరం తేడాలో పుట్టబట్టి అవే పదిజతలు అందరం వేసుకుని పేదరికం బయటకు కనపడకుండా చూసుకుంటాము.. 


సరస్వతి వాళ్ళది మూడు అంతస్తుల భవంతి .. 


దానికి ఎదురుగా దిష్టి చుక్క పెట్టినట్లుగా చిన్న పాడుపడిన పెంకుటిల్లు తమది. 


చిన్నప్పటి నుండి తను, సరస్వతి ప్రాణ స్నేహితుల్లా పెరిగాము. వాళ్ళ అమ్మ ఇష్ట పడక పోయినాసరస్వతి తనతో స్నేహం మాత్రం వదల్లేదు.


గవర్నమెంట్ కాలేజీ లోనే చదువుతానంటూ పట్టు పట్టి తన కోసం ఈ కాలేజీలో చేరింది. కారులోవెళ్ళమని వాళ్ళ నాన్నగారు ఎంత చెప్పినా వినకుండా కాలేజీ కి బస్సులో వెళ్లడమే తనకిష్టమనితనతోనే వస్తుంది. అందుకే ఎంత లేటైనా సరస్వతి తోనే వెళ్లడం.. 


వెళదామా!? అని సరస్వతి అనడంతో ఆలోచనల్లోంచి బయట పడింది వైభవి.


కాలేజీలో వైభవంటే అందరికీ హడల్.. లేడీస్ రిప్రెజంటేటివ్ మరి.. మంచి వక్త.. అందగత్తెననేఅహంకారం.. డబ్బుంటే చాలని.. డబ్బుతో ప్రపంచాన్నే జయించ వచ్చని ఆమె వాదన.. 


తను అనుకున్నది సాధించేంత వరకు వదలని మనస్థత్వం.. 


తనది తప్పయినా ఒప్పని వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఒప్పించగల సమర్ధత ఆమెకున్నాయి.


దీనికి పూర్తిగా వ్యతిరేకం సరస్వతిది.. మితభాషి..తెలివైనది..ఆడంబరాలు గిట్టవు..ఇతరులమనసుని ఒప్పించ కూడదనే స్వభావం, తన మనసు విప్పి ఎవరికీ చెప్పలేని మెుహమాటం.


తండ్రి రాజేశ్వర్ గారికి గారాల పట్టి. తండ్రి దగ్గరే ఆమెకి చనువు. 


సరస్వతి కి ఇద్దరు తమ్ముళ్లు.. సరస్వతి తల్లికి కొడుకులంటేనే ఇష్టం.. వంశోద్ధారకులని. సరస్వతిఅంటే చిన్న చూపు ఆమెకి. ఆడపిల్లని.. నల్లగా ఉంటుందని అయిష్టం.


బీ. టెక్. ఫైనల్ ఇయర్ లో ఉండగానే వైభవి పెళ్ళి కుదిరింది. రోజూ కన్నా ముందే బస్సు స్టాప్ కివెళ్ళింది వైభవి. 


సరూ!! సరూ!! నీకో విషయం చెప్పాలి అంది సరస్వతిని చూస్తూనే ఆనందంతో మొహం వెలిగిపోతూండగా.



అమ్మాయిగారిని చూస్తూనే అనుకున్నా ఏదో విశేషం ఉందని.. పెళ్ళి గాని కుదిరిందా ఏమిటి!? అంది చిరునవ్వుతో. 


“నన్ను చూస్తూనే నా మనసులో ఏముందో చెప్పేస్తావు నువ్వు” అని ఎంతో ఉత్సాహంతో.. 


నిన్ననే అనుకోకుండా పెళ్ళిచూపులయ్యాయని.. వాళ్ళది సంపన్నుల కుటుంబమని.. అతను చాలహ్యాండ్సమ్ గా ఉన్నాడని..వెంటనే ముహూర్తం పెట్టుకుందాం అన్నారని.. తను వాళ్లకి బాగా నచ్చిపెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే  ఎదురు పెట్టుకుని చేసుకుంటామన్నారని అని ఎంతో ఆనందంగాచెప్పింది.


వైభవి చెప్పిన శుభ వార్త విన్న సరస్వతి కి చాలా సంతోషంగా అనిపించినా.. తనకున్న ఒక్కగానొక్కస్నేహితురాలు తననొదిలి వెళ్లిపోతుందంటే బాధ అనిపించింది.


వైభవి పెళ్లి ఘనంగా జరిగింది. వెంటనే

కాపురానికి కూడా వెళ్ళిపోయింది. 


ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వ్రాయనందుకు బాధ పడ్డది సరస్వతి.


ఏదో కేసు నిమిత్తం కోర్ట్ కి వెళ్లిన రాజేశ్వర్ గారికి జూనియర్ లాయర్ అయిన అద్వైత్ కేసువాదించిన తీరు..అతని వాగ్ధాటి ఆయన్ని అబ్బుర పరిచాయి. 


అతనికి సరస్వతిని ఇచ్చి వివాహం చేస్తే బాగుండుననే ఆలోచన వచ్చి అతని గురించి వాకబుచేశారు.


అతనికి తండ్రి లేడని.. కుటుంబంలో పెద్దవాడని.. ఆస్థి పాస్తులేమీ లేవని.. బాధ్యతలున్నాయనితెలియడంతో ఆలోచనలో పడ్డారు.


ఆ రోజు భార్యతో ఈ విషయం ప్రస్తావిస్తే వాళ్లకి ఆస్తులు లేకపోతే ఏమైంది!? మనం ఇవ్వచ్చు కదా!! ముందు వాళ్లకి మన నల్ల బంగారం నచ్చాలి కదా..అని ఆవిడ వెక్కిరింపుగా అనడంతో ...


పిల్ల పెద్దదయింది, అది వింటే బాధ పడుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు" అని భార్యమీద మండిపడ్డారు రాజేశ్వర్ గారు.


మధ్యవర్తి ద్వారా అద్వైత్ తల్లితో సంప్రదించి పెళ్ళి చూపులకి ఏర్పాటు చేశారు. ఇరువైపుల వారికిఅన్నీ నచ్చడంతో ఒక నెల వ్యవధిలో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు.


తండ్రి చెప్పిన విషయాలు.. అతడు తనతో మాట్లాడిన పధ్ధతి.. ఆడవాళ్ళ పట్ల అతనికున్నగౌరవం.. ఆమెని అతని వైపు ఆకర్షించేలా చేసాయి. 


సరస్వతి నిరాడంబరత.. సరళమైన మాట తీరు.. పెద్దవాళ్ళంటే వినయం అతనికి ఎంతగానోనచ్చాయి.


సరస్వతి, అద్వైత్ ల వివాహం ఎంతో నిరాడంబరంగా జరిగింది.. వారిద్దరి కోరిక మేరకు.


రాజేశ్వర్ గారు ఇస్తానన్న కట్న కానుక ల్ని కూడా సున్నితంగా తిరస్కరించారు అద్వైత్, అతని తల్లి.


సరస్వతి కూడా వద్దని చెప్పడంతో ఏమీ చేయలేక మిన్నకుండి పోయారు. వాళ్ళ ఉన్నత భావాలకిసంతోషించినా, కూతురికి ఏమీ ఇవ్వలేకపోయానే అని బాధ పడ్డారు.


తన వివాహానికి కనీసం రెండు రోజుల ముందైనా వైభవి వస్తుందని ఆశ పడిన సరస్వతి కి నిరాశేమిగిలింది. 


మెడ నిండా నగలు, ఖరీదైన కంచి పట్టు చీరలో మెరిసి పోతున్న వైభవి అక్షతలు వేస్తూ. " ప్రేమతోతన చెయ్యి సున్నితంగా నొక్కి..నువ్వు కోరుకున్నట్లుగానే మంచి

వ్యక్తిని పొందావు.. 


అంకుల్ అంతా చెప్పారు నాకు..

సంతోషంగా ఉండు సరూ.. “గాడ్ బ్లెస్ యూ..!" అని చెప్పి వెళ్లిపోయిన దృశ్యమే తన కళ్ళముందుంది అనుకుంది సరస్వతి.. ఎందుకో వైభవి సంతోషంగా లేదనిపించింది ఆమెకి.


సరస్వతి అతి తక్కువ వ్యవధి లోనే అత్తగారింట్లో అల్లుకుపోయింది.. 


తను చేసే చిన్న చిన్న పనులకే అత్తగారు, భర్త పొగడటంఆమెకి ఎంతో  సంతోషాన్ని ఇచ్చేది. 


అత్తగారి ఇంట్లో ఎంత  చిన్న విషయమైనా అందరూకూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు  తీసుకోవడం.. డైనింగ్టేబుల్ వద్ద  గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం.. రోజూపండుగలా అనిపించేది ఆమెకు.



సరస్వతికి తన పుట్టిల్లు గుర్తుకు వచ్చి బాధతోనిట్టూర్చింది. ప్రైవసీ పేరుతో మనిషికొక గది.


చెప్పుకోవడానికి ఇద్దరు తమ్ముళ్ళనే కానీ వాళ్ళతో  కలిసి  గడిపిన సమయం చాలా అరుదు అనే చెప్పొచ్చు.. 


ఎవరి బిజీ లో వారుండటం..

 ఎవరిష్టమొచ్చినప్పుడు వాళ్ళు తినడం, వండినవినచ్చకపోతే వంటామెకి  ఆర్డర్ జారీ  చేసి నచ్చినవిచేయించుకుని తినటం..


రోజూ ఎంత ఫుడ్ వేస్ట్ అవుతుందో ఎవరికీ  తెలీదు. 


అంతులేని ధనం విలాస వంతమైన జీవితానికి, మనుషుల మధ్య దూరం పెరగడానికి  కారణమేవెూఅనిపించింది ఆమెకి. 


అత్తగారింట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆత్మీయతానురాగాలు ఆమెని ఎంతగానోఆకట్టుకున్నాయి.


అత్తగారితో కలిసి వెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకోవడం.. ఆమె దగ్గర కుట్లు, అల్లికలునేర్చుకోవడం..

మరిది, ఆడపడుచుకి వాళ్ళ చదువులో సహాయం చేయడం.. 


సరస్వతికి జీవితం ఎంతో సంతృప్తి కరంగా సాగిపోతోందనిపించింది.


సరస్వతి కుటుంబ బాధ్యతల్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండటంతో 

అద్వైత్ కి కోర్ట్ నుండి వచ్చాక రెస్ట్ తీసుకోవడానికి కుదిరేది.


వివాహమైన తర్వాత గల గలా మాట్లాడటం, మనస్ఫూర్తిగా నవ్వడం.. కూతురిలో వచ్చిన మార్పుగమనించిన రాజేశ్వర్ గారు చాలా సంతోషపడ్డారు.


కాలచక్రంలో అయిదు సంవత్సరాలు ఇట్టే గడిచి పోయాయి.


సరస్వతికి ఇద్దరు పిల్లలు.. ఒక బాబు, ఒక పాప.


ఈ ఐదేళ్ళలో వైభవి తో రెండు మూడు సార్లు మాట్లాడిందేమో సరస్వతి. వైభవి కి ఫోన్చేసినప్పుడల్లా ఆమె భర్తే  ఫోన్ తీయడం.. వైభవి కూడా ముక్తసరిగా మాట్లాడటంతో వాళ్ళమధ్య సంభాషణ సాగేది కాదు.


ఒక రోజు సాయంత్రం పిల్లల్ని తీసుకుని భర్త తో కలిసి పార్కుకి వెళ్లిన సరస్వతికి దూరంగా చెట్టుక్రింద కూర్చున్న ఆమె ఎవరో తెలిసినట్లుగా అనిపించటంతో.. అటుకేసి వెళ్ళింది. 


సమీపానికి వెళుతుండగా వైభూలా ఉందే! అనుకుని తన పిచ్చి గానీ.. వైభూ ఒక్కర్తీ ఈ చీకట్లోఎందుకు కూర్చుంటుంది!? అనుకునేలోగా.. ఏడుస్తున్న ఆమె తల త్రిప్పి చూసింది అలికిడికి. స్నేహితురాల్ని అక్కడ ఊహించని వైభవి కంగారుపడి గబ గబా కళ్ళు తుడుచుకుని.. సరూ!! నువ్వేమిటి ఇక్కడిలా!? అని అడిగింది వెలాతెలా పోయిన మెుఖంతో.


“నేనడగాలా ప్రశ్న !! ఒక్క దానివే ఏం చేస్తున్నావు ఇక్కడ!? మీ వారు, పిల్లలు ఏరి!? అనిఅడిగి..నడు.. అలా బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుందాం వెలుగులో” అంది సరస్వతి.


మారు మాట్లాడకుండా ఆమెని అనుసరించింది వైభవి. 


బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు.


ఇద్దరి మనసులో ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు..


కాసేపు ఇద్దరి మధ్యా మౌనం..


తల వంచుకుని కూర్చున్న వైభవినే పరీక్షగా చూసిన సరస్వతి మనసంతా భారంగా అయ్యింది.


ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు.. కళ్ళ క్రింద నల్లని చారలు.. జుట్టు అంతా ఊడిపోయి పెద్దదైన నుదురు.. నిర్లిప్తంగా ఉన్న చూపులు.. ఒకప్పటి కాలేజ్ బ్యూటీ ఐన ఆమె అందమంతా ఏమైంది!? అనిబాధపడి...


మెల్లిగా వైభవి చేతిని తన చేతిలోకి తీసుకుని “ఏమైంది వైభూ!?

ఉత్సాహానికి మారు పేరులా ఉండే నువ్వేనా ఇలా !! నమ్మశక్యంగా లేదు నాకు అని..”ముందుపెద్దవాళ్లలా భుజాల చుట్టూ కప్పుకున్న ఈ చీర కొంగు తీసేయ్.. నీకస్సలు నప్ప లేదు” అనిచనువుగా చీర కొంగు లాగేటప్పటికి వీపు నిండా వాతలు..

సరస్వతి ఖంగుతింది.. నోట మాట రాలేదు.

వైభూ!! అంటూ అమాంతంగ ఆమెని దగ్గరకి తీసుకుంది.


వైభూ!! అన్న ఒక్క ప్రేమతో కూడిన పిలుపుకే..

“సరూ! అంటూ ఆమెని సుడిగాలిలా చుట్టేసుకుని...నాకసలు బ్రతకాలని లేదు.. నేనుచనిపోతానంటూ”భోరున ఏడ్చింది.


ఎన్ని రోజుల నుండో ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని వరదలై పొంగింది.


ఊహించని ఈ సంఘటన సరస్వతిని పూర్తిగా అయోమయంలో పడేసింది. 


ప్రేమగా ఆమె వీపు మీద నిమురుతూ తానున్నాననే ధైర్యం ఇస్తూ ఆమె మనసు ఊరట పడేంతవరకు 

ఏడవనిచ్చి వైభూ!! అసలు ఏం జరిగింది!?.. వివరంగా చెప్పు నాకు!? అని అడిగింది సరస్వతిఎంతో ఆర్తితో కూడిన స్వరంతో. 



తన భర్తకి, అత్తగారికి స్టేటస్ సిమ్బల్ గా ఒక అందమైన బొమ్మ కావాలని.. దానికంటూ ఒకమనసు, సొంత అభిప్రాయాలు ఉండకూడదని.. దానికి తను బలైపోయిందని..


పెళ్ళైన కొత్తల్లో అతను “నీ కాలేజీ కబుర్లు చెప్పు” అని అడిగితే తను నిజాయితీగా అన్నివిషయాలు చెప్పిందని, తనని ఎంత మంది ప్రపోజ్ చేశారో కూడా చెప్పడంతో .. రోజూ తాగి వచ్చిగుచ్చి గుచ్చి అదే విషయాలు అడిగి టార్చర్ పెట్టేవాడని .. తనేమీ మాట్లాడకపోతే సిగరెట్ తో కాల్చివాతలు పెట్టి

హింసించేవాడని..


అతనికి అనుమాన పిశాచం కూడా ఉందని.. చివరికి పని అబ్బాయితో, డ్రైవర్ తోనూ సంబంధంఅంటకట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పింది.


తనని పద్మ వ్యూహంలో బంధించాడని.. తన తల్లి తండ్రులకి డబ్బు అప్పుగా ఇచ్చి వడ్డీ కిచక్రవడ్డీలు కలిపి చాలా అవడంతో.. తానేమాత్రం ఎదురు తిరిగినా అతనికున్న పలుకుబడితో మావాళ్ళ బ్రతుకులు బజారుకీడుస్తానన్నాడని.. 


దానితో డైవర్స్ ఇచ్చే ధైర్యం చేయలేక పోయానని.. జీవితం విలువ తెలియక ఎండమావులవెనుక పరుగెత్తినందుకు తనకీ శాస్తి జరగాల్సిందేనని వాపోయింది వైభవి.


పుట్టింటికి వెళ్లాలన్నా అతనితోనే వెళ్ళిరావాలని.. చివరకి తన ఫోన్  కూడా అతని ఆధీనంలోనే  ఉంటుందని..అదృష్టవశాత్తూ ఈ రోజు నువ్వుకనిపించావని.. ఎప్పటి నుండో నీతో మాట్లాడాలన్న కోరికఇప్పటికిలా నెరవేరిందని  తన గోడంతా వెళ్ళ బోసుకుందివైభవి.


భయపడాల్సిన పనేమీ లేదని చెప్పి.. అక్కడే పిల్లలితో ఆడుకుంటున్న అద్వైత్ కి పరిచయం చేసి తనతో ఇంటికి తీసుకు వెళ్ళింది సరస్వతి.


సరస్వతి అత్తగారు కూడా సహృదయంతో పరిస్థితిని అర్ధం చేసుకుని వైభవికి ధైర్యాన్ని ఇచ్చారు.


భర్త అద్వైత్ సాయంతో గృహ హింస చట్టం క్రింద అతి కొద్ది కాలంలోనే వైభవికి డైవర్స్ఇప్పించింది.


సరస్వతి ప్రోత్సాహంతో స్వతహాగానే తెలివైన వైభవి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 


స్నేహితురాళ్ళిద్దరూ కలిసి పీ. జీ. డిస్టింక్షన్ లో పాస్ అయి వాళ్ళు చదువుకున్న కాలేజీలోనేలెక్చరర్స్ గా అప్పాయింట్ అయ్యారు.


తను అవివేకంతో డబ్బుకే ప్రాధాన్యతనిచ్చి పై పై మెరుగులు చూసి

మోసపోయానని.. 


సరస్వతి మంచి వ్యక్తిత్వానికి, కుటుంబ విలువలకి ప్రాధాన్యతనిచ్చి తన జీవితాన్ని మంచిగామలచుకోవడమే కాక.. 


మంచి స్నేహితురాలిగా తన జీవితాన్ని కూడా తీర్చిదిద్దిందని..


ఆ నరకం నుండి తనకి విముక్తి కలిగించినందుకు సరస్వతికి, అద్వైత్ కి ఏమిచ్చినా ఋణంతీర్చుకోలేనని చెప్పింది వైభవి.


స్నేహితుల మధ్య రుణాలకు తావు లేదని ఎప్పటికి తమ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరిందిసరస్వతి.


(సమాప్తం)




Rate this content
Log in

Similar telugu story from Drama