STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Drama

4  

Dinakar Reddy

Abstract Children Stories Drama

వర్షాకాలం.. వచ్చేను జ్వరం..

వర్షాకాలం.. వచ్చేను జ్వరం..

1 min
421

అమ్ములూ! అమ్ములూ! ఇదిగో ఈ నైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళవే.. బయట దోమలు ఉంటాయి అని విమల హెచ్చరిస్తున్నా అమ్ములు వినకుండా బయటకు పరిగెట్టింది..


అన్నీ వాళ్ళ నాన్న పోలికలే అంటూ షార్ట్ వేసుకుని కూర్చున్న శ్రీకర్ ని అంటూ బజ్జీలు వేయడానికి వెళ్ళింది.


రాత్రికి అన్నం తినను అంటూ పడుకున్న అమ్ములు పొద్దున్నే యెనిమిది అవుతున్నా లేవలేదు..


అమ్ములూ! స్కూలుకు వెళ్ళవా బంగారూ! నువ్వూ నాన్నలా ఇంట్లోనే ఉంటావా అంది విమల అమ్ములును కదిలిస్తూ..


అబ్బా.. నేను వర్క్ ఫ్రం హోమ్ కదా అన్నాడు శ్రీకర్ దుప్పటి మళ్లీ కప్పుకుంటూ..


అయ్యో.. పిల్ల ఒళ్ళు కాలిపోతోంది.. జ్వరం వచ్చిందేమో అంది విమల. శ్రీకర్ వెంటనే లేచి అమ్ములు నుదిటిపైన చెయ్యి పెట్టి చూసి అవును అలానే ఉంది అంటూ థర్మామీటర్ తెచ్చి చూశాడు..


విమల ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేసింది.. అమ్ములు చలి అంటుంటే తన గుండెలకు హత్తుకుని పడుకోబెట్టింది.. ఏ దోమలో కుట్టుంటాయి.. నిండుగా బట్టలు వేసుకొని వెళ్లవే అంటే విన్నావా అని అమ్ములును అంటూ అత్తగారు ఇచ్చిన అరుణాచలం విభూదిని అమ్ములు నొసట పెట్టింది..


డాక్టర్ వచ్చి మందులు వ్రాసిచ్చి తనతో వచ్చిన అసిస్టెంట్ ని బ్లడ్ శాంపిల్ తీసుకోమని చెప్పాడు...


డాక్టర్ వెళుతూ మలేరియా లక్షణాలు ఉన్నాయి.. రిపోర్ట్స్ వచ్చాక చూద్దాం అని చెప్పాడు..


ఇక ఆ రాత్రంతా విమల అమ్ములుకు అన్నం తినిపిస్తూ, జోకొడుతూ మలేరియా గురించి చెబుతూ ఉంది.. మధ్య మధ్యలో దోమల్ని తిడుతూ, దోమల బ్యాట్ పట్టుకుని దోమల్ని సరిగ్గా కొట్టట్లేదు అని శ్రీకర్ కి గుర్తు చేస్తూ ఉంది.


అమ్ములు వింటూ ఉంది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract