వెంటాడిన కల
వెంటాడిన కల


డాడీ నేను సెకండ్ షో మూవీకి వెళ్తున్నా.... అరవింద తండ్రితో చెబుతోంది.
కూతురు ఒక మాట చెబితే ఎంత చెప్పినా తరువాత నిర్ణయం మార్చుకోదని హరికి తెల్సు కానీ మొన్నటికి మొన్న పక్క వీధి సుమనకు జరిగిన అత్యాచారం గుర్తొస్తూ.... కన్నా మ్యాట్నీ షో కి వేళ్ళు కావాలంటే రేపు కాలేజ్ కి కూడా వెల్లద్ధులే బంగారం కదూ... అని బుజ్జగిస్తున్నాడు.
ఏంటి డాడీ మీరు చాదస్తం గా మాట్లాడతారు కాలం మారికొద్ది కొంచెం మీరు మారండి అయినా నేను రేష్మ టికెట్స్ బుక్ చేయించేసుకున్నాం కూడా, ఇక్కడ స్కూటీ లో వెళ్లి అక్కడ దిగి మూవీ చూసి తిరిగి స్కూటీ లో వచ్చేస్తా దానికే ఎందుకు వద్దు అంటారు. ఫ్రెండ్స్ అందరూ ఎందుకు వెళ్ళలేదు టికెట్స్ బుక్ చేయించారు కదా ని అడిగితే నేనేం చెప్పాలి అందరి ముందు షేమ్ అయిపోతా నేను.ఏకధాటిగా చెప్పేసి తన నిర్ణయం మారదన్నట్టు వెళ్ళిపోయింది. హరి కూతురు మొండితననికి కోపం చేసుకోలేక తాను చేసిన గారభం కు బాధపడలేక గా కూతురు వైపే చూస్తుండిపోయాడు.
సైరా సినిమా ఆ థియేటర్ లో అంతమంది మధ్యన చిరంజీవి కి ఒకటే విజిల్స్, కేకలు అభిమానులు ఎగరేస్తున్న కలర్ పేపర్స్ వర్షంలా సినిమా తీసినవాళ్లకు కూడా కలెక్షన్ల వర్షం కురిసిపోతోంది అలాగే అరవింద వెళ్లిన చోట కూడా ఆశ్చర్యం, ఆవేదన, డైలాగ్స్ కు ఉప్పొంగే భావాలు ఇలా సినిమా మొత్తం రకరకాల హవాభవాలు అనుభూతి చెంది థియేటర్ నుండి బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది వందమిటర్లు రాగానే సడెన్ గా స్కూటీ ఆగిపోయింది జనసంచారం తక్కువ వుండటం తో చుట్టూ చీకటి ఒకరిద్దరు కనబడుతున్న ఎవరికి వారు వెళ్లిపోతున్నవాళ్లే కానీ దగ్గరకొచ్చి సహాయం చేసేవాళ్ళు లేరు. ఇంతలో ఒక బైక్ అరవింద దగ్గరకు వచ్చి ఆగింది. అరవింద ను లాగుతున్నారు ఒక్కసారిగా ముక్కులకు కర్చీఫ్ అడ్డు పెట్టి మత్తు ఇచ్చి ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లిపోయారు. చివరలో వాళ్లతో పెనుగులాడుతూ డాడీ అని అరిచిన అరుపు. ఒక్కసారిగా కన్నా అనే పిలుపుతో దిగ్గున లేచాడు హరి. కూతురు వెళ్ళగానే కుర్చీలోనే ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాడు. చుట్టూ గమనించుకుని ఇదంతా కలనా కానీ ఏమైనా జరిగితే అని తొందరగా లేచి షర్ట్ వేసుకుని గుమ్మం దగ్గరకు వెళ్ళగానే ఎదురొచ్చింది అరవింద.
కన్నా మూవీ కి వెళ్లలేద నేనే వద్దాం అనుకుంటున్నా మూవీ అయిపోగానే ఇంటికి తీసుకురావడానికి నువ్వే వచ్చేసావ్ ఏమైందిరా అన్నాడు.
నేను వెళ్ళగానే పది నిమిషాల తరువాత రేష్మ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలొ అనగానే అరు నేను మూవీకి రవట్లేదుమా భయ్యా చెన్నై నుండి వస్తున్నాడు. ప్లీజ్ ఏమనుకోకు ని ఫోన్ పెట్టగానే ఊసురుమంటూ వెనుదిరిగా మధ్యలో స్కూటీ ట్రబుల్ ఇచ్చింది డాడి ఎవరో వచ్చి హెల్ప్ చేశారు తిరిగొచ్చేసా ఒకదాన్ని బోర్ కొడుతుందని అని చెబుతూ లోపలికెళ్లిపోయింది.
తనకు వచ్చిన కల మాత్రం జీవితంలో భయాంకరమైనదిగా నిలిచిపోయింది హరికి.