Sravani Gummaraju

Romance

4.7  

Sravani Gummaraju

Romance

దైవమిచ్చిన బంధం

దైవమిచ్చిన బంధం

2 mins
1.1K



బస్ విండో లోనుంచి బయటకు చూస్తోంది అఖిల. ఆరునెలల కిందటి సంఘట వద్దన్నా కళ్ళ ముందు మెదులుతోంది. తెరలుతెరలుగా తనముందు మెదులుతున్న జ్ఞాపకాలు.......

          @@@@@@@@@@@@

"నీకు నాకు కుదరని పని అని ఎన్నిసార్లు చెప్పాలి?? విసిగించక వెళ్ళు" ఎప్పటిలానే కసురుకుంటూ... మొహాన్ని కందగడ్డలా చేసుకుని కళ్ళనుండి చింతనిప్పుల్లాంటి చూపులను విసురుతూ ముందుకు సాగింది అఖిల.


   అదంతా తనకు అలవాటే అన్నట్టు సన్నగా నవ్వుతూ వెళ్ళిపోయాడు అరవింద్. అఖిల చూడ్డానికి నల్లగా ఉంటుంది. మెడలో నల్లదారం దానికో ఆంజనేయస్వామి బిళ్ళ, చేతికి మట్టి గాజులు, వేలికి రాగితో చేసిన లక్ష్మీ దేవి ఉంగరం. నుదుటన దోసగింజలా పెట్టుకున్న తిలకం, దానికింద కుంకుమ. కళ్ళకు కాటుక, కాళ్లకు మాత్రం గల్లు మని సవ్వడి చేసే మువ్వల పట్టీలు, ఎలా చూసినా తనలో గొప్పగా చెప్పుకోవడానికి చూపించడానికి ఖరీదైన వస్తువు లేదు. కానీ అరవింద్ మాత్రం గత ఏడాదిగా వెంటపడుతూనే ఉన్నాడు. ఇపుడు అలాగే వెంట పడ్డాడు అఖిల ఎప్పటిలా తిట్టి వెళ్లిపోగానే.... వెనకనుండి వచ్చి భుజం మీద చెయ్యేసి మామా.... ఏంటిరా ఇది?? తనేదో హీరోయిన్ లెక్క ఫీల్ అయిపోతోంది ఏడాది నుండి వెంట పడుతున్నావ్ ఏముందిరా తనలో?? అందమా లేదు, అలాగని బాగా ఉన్నవాళ్ళా కాదు ఏమి చూసి పెంచుకున్నావ్ రా ప్రేమ?? అడిగాడు రోహిత్.

           @@@@@@@@@@@@


  ఏంటే.... అదృష్టం వచ్చి గుమ్మం ముందు నిలబడితే కాదుపొమ్మంటావ్??? నీలాంటి వెర్రిదాన్ని నేనెప్పుడూ చూళ్ళేదు. అయినా అరవింద్ కు ఎం తక్కువ??? బాగా చదువుతాడు, రేపో మాపో చదువు అవ్వగానే వాల్ల నాన్న కంపెనీకి వీడే వారసుడు. కుర్రాడు కూడా బలే ఉంటాడు.వంకలు పెట్టడానికి ఎం దొరకదు కూడా అలాంటిది కాదుపొమ్మంటావ్ ఏంటి??? ప్రశ్నల వర్షం కురిపించింది జ్యోతి.


    ఏమి తక్కువ లేదు కాబట్టే అలాంటి మనిషి జీవితం లోకి వెళ్లాలంటే భయపడాలి. ఎందుకో తెలుసా ఆశ పడేది మనసైతే తరువాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అనుభవించాల్సింది ఈ శరీరమే......వాళ్ళ స్థాయికి సరిపోమని తెల్సినపుడు అటువైపు చూడకూడదు క్లాస్ కు టైమ్ అవుతుంది వెళదాం పదా అని ముందుకు కదిలింది.


   చాటుగా విన్న అరవింద్ ముందుకొచ్చాడు. స్థాయి అనేది ఆర్థిక పరంగా చూడకూడదు అఖిల. డబ్బు అనేది మనిషిని గొప్పవాడని చెబుతుందేమో కానీ గుణం మాత్రం ఆ డబ్బు ఎంత పెట్టి కొన్నా కూడా రాదు. అందరూ నిన్ను నల్లగా ఉన్నావంటారు, నాకు మాత్రం వెన్నెల రాత్రిలా కనబడతావు ఎంత చల్లగా హాయిగా ఉంటుంది కదా, ఏమిటి ఆ డ్రెస్ అంటారు అందరూ నిన్ను చూసి కానీ నువ్వు ఆ తోటల్లో విరిసి స్వేచ్ఛగా ఊగుతున్న ముద్దబంతిలా కనిపిస్తావ్. ఇప్పట్లో మొహాలకే కాదు మనసులను కూడా రంగులేసుకుని ముసుగులో అన్ని అనేస్తూ బయటకు మాత్రం లిప్స్టిక్ నవ్వులు నవ్వుతారు కానీ నువు మాత్రం ఆ పల్లె చెట్ల కొమ్మల్లో కోయిలలా నవ్వులు విరబయిస్తూ ఉంటావు. నీకు ఒక వేళ డబ్బు అనేది కారణం అయితే ఇదిగో ఈ చదువు అవ్వగానే సొంతంగా ఉద్యోగం చేసుకుంటూ పైకి ఎదుగుతాను. కానీ జీవితానికి అర్థం చెప్పగలిగే నీలాంటి అమ్మాయిని నేను వదులుకోను ఇప్పుడు కూడా నీకు నేను నచ్చకపోతే ఇక ఎపుడు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు.


          @@@@@@@@@@@


   బస్ కుదుపులకు తన భుజం మీద వాలిన మనిషి వైపు చూసింది పసిపిల్లాడిలా నిద్రపోతున్న అరవింద్ మూడుముళ్ల బంధంతో జీవితంలో ఒకరికి ఒకరుగా ఉండాలని ఏడడుగుల దారప్పొగును ఎన్నెన్నో జన్మలబంధానికి వారసత్వంగా రావాలని అనుకుంటూ అతని ముంగురులను మెల్లగా సవరిస్తూ తన జీవితంలో మర్చిపోలేని రోజు ను గుర్తు తెచ్చుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకుంది 



Rate this content
Log in

Similar telugu story from Romance