వేలి ముద్ర
వేలి ముద్ర


బాగా సదువుకో బాబూ.ఎంత బాగా సదువుకుంటే అంత మంచిది సామీ.
ఇవి నేను పల్లెకు పోతే వినపడే మాటలు.
ఎందుకు నాన్నా అందరూ చదువుకో చదువుకో అని పదే పదే చెప్తారు పల్లెలో.
నాన్న చెప్పారు ఇలా.అప్పట్లో చదువు రాక సంతకం పెట్టడం కూడా చేత రాక వేలి ముద్ర వేసి ఆస్తులు పోగొట్టుకున్న జ్ఞాపకాలు.
పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో చూపించుకోవడానికి ఇలా ఎన్నో విషయాల్లో కాస్తో కూస్తో చదువు చాలా అవసరం అయ్యేది.
అందుకే పల్లెల్లో చదువును ప్రాణంగా భావిస్తారు.
అసలు ఎవ్వరూ వేలి ముద్ర వేసే వాళ్ళలా ఉండిపోకూడదు అని భావిస్తారు.
డబ్బులు లేక చదివించుకోలేకపోతే చాలా బాధపడతారు.
నిజంగా చదువు లేని వాళ్ళకు చదువుకోలేక పోయిన వాళ్ళకు చదువు విలువ బాగా తెలుసు కదా అనిపించింది నాకు.