Dawath Sainath

Drama Tragedy Thriller

4.4  

Dawath Sainath

Drama Tragedy Thriller

వైదేహి కోసం రఘు,రామ్

వైదేహి కోసం రఘు,రామ్

7 mins
564


        ఒక రోజు రఘు ఇంటికి వెళ్తుండగా తనకి ఎదురుగా వస్తున్న జంటని చూసి తనకి కూడా అలంటి జీవితం ఉంటె బాగుంటుంది అని అనుకుంటూ అలాగే ముందుకు వెళ్తున్నాడు.


ఎదురుగా వస్తున్న బస్సు నీ రఘు గమనించలేదు, అలాగే అ జంటని చూస్తూ ముందుకు వెళ్తున్నాడు అది చుసిన ఒక అమ్మాయి రఘు నీ బస్సు ఢీకొట్టకుండా పక్కకు తోసి కాపాడుతుంది. రఘు కిందపడతాడు బస్సు వెళ్ళిపోతుంది.


రఘు మెల్లిగా లేస్తాడు అప్పుడు అ అమ్మాయి రఘు తోమాట్లాడుతూ " ఎదురుగా వస్తున్న బస్సు కనిపించలేదా, లేక నీకు కనపడదా" అని అంటుంది. 


అప్పుడు రఘు మాట్లాడుతూ " నేను గుడ్డి వాడిని నాకు కనిపించదు అని చెప్తాడు" ." అయ్యో నన్ను క్షమించు ,నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పు నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను "అని అమ్మాయి అంటుంది. 


" పర్లేదండి నేను ఇక్కడ పక్కనే ఉంటాను నేను వెళ్తాను , నన్ను కాపాడినందుకు కృతఙయతలు " అని చెప్పి రఘు అక్కడి నుండి వెళ్ళిపోతాడు .


కొన్ని రోజుల తర్వాత రఘు తనని కాపాడిన అమ్మాయి నీ ఓక అనాదశరణాలయం దగ్గర పిల్లలకి బట్టలు ఇంకా స్వీట్స్ పంచుతుంటే చుస్తాడు. అ అమ్మాయి దగ్గరకు వెళ్తాడు అ అమ్మాయి రఘు నీ గుర్తుపడుతుంది. 


రఘు అ అమ్మాయితో మాట్లాడుతూ " నన్ను క్షమించండి అ రోజు నేను గుడ్డి వాడిని అని మీకు అబద్ధం చెప్పాను అని అ రోజు రఘు చుసిన సంఘటన , తను ఆలోచించింది మొత్తం అమ్మాయికి వివరిస్తాడు". మొదట రఘు నీ తిడుతుంది అ అమ్మాయి తర్వాత రఘు ని అర్ధం చేసుకుంటుంది. ఇద్దరు కలిసి పిల్లలకు బట్టలు , స్వీట్స్ పంచి పక్కనే ఉన్న కాఫీ షాపు కి వెళ్తారు.


కాఫీ షాపు లో రఘు మాట్లాడుతూ " మీ పేరు ఏంటి అని అమ్మాయి నీ అడుగుతాడు ". అప్పుడు అమ్మాయి " నా పేరు వైదేహి , మాది గుంటూరు. ఇక్కడ హాస్టల్ లో ఉంటాను మా ఆఫీస్ కి దగ్గర్లో . నువ్వు ఏమి చేస్తుంటావ్ "అని అంటుంది వైదేహి .


రఘు మాట్లాడుతూ " నా పేరు రఘు , ఇంజనీరింగ్ చేసాను , జాబ్ కోసం అప్లికేషన్ పెట్టాను ఎదురు చూస్తున్న వాళ్ళ సమాధానం కోసం. ఇక్కడ మా స్నేహితుడి రూమ్ లో ఉంటున్న , నాకు జర్నలిస్ట్ కావాలి అని ఇష్టం అదే ప్రయత్నిస్తున్న . జర్నలిస్ట్ ఎందుకు అంటే జాబ్ లో ఒక అడ్వెంచర్ ( adventure ) ఉండాలి" అని రఘు చెప్తాడు.


కాసేపటి తర్వాత రఘు , వైదేహి నెంబర్ అడుగుతాడు , నా ఫోన్ నెంబర్ నీకు ఎందుకు అని అంటుంది వైదేహి . నేను జాబ్ కోసం చూస్తున్న కదా మీ ఆఫీస్ లో జాబ్ ఉంటె చెప్తారు కదా అందుకే మీ ఫోన్ నెంబర్ అడిగాను . కొన్ని రోజులు ఏదయినా జాబ్ చేదాం అని రఘు , వైదేహి తో అంటాడు .సరే అని వైదేహి రఘు కి నెంబర్ ఇస్తుంది.రఘు నెంబర్ వైదేహి తీసుకుంటుంది.


ఒక వారం తర్వాత వైదేహి , రఘు కి ఫోన్ చేస్తుంది . రఘు తో మాట్లాడుతూ " హలో రఘు నేను వైదేహి ఎలా ఉన్నావ్ " అని అడుగుతుంది వైదేహి. 


" నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని " రఘు అంటాడు ." నేను బాగున్నా , మా ఆఫీస్ లో రేపు ఇంటర్వ్యూ ( interview ) ఉంది నువ్వు జాబ్ కోసం చూస్తున్న అని చెప్పావ్ కదా అందుకే కాల్ చేశాను" అని వైదేహి అంటుంది .


" అవునా థాంక్స్ అండీ . రేపు ఏ టైం కి రావాలో చెప్పండి నేను వస్తాను " అని రఘు అంటాడు .

ఇంటర్వ్యూ వివరాలు వైదేహి , రఘు తో చెప్తుంది .


తర్వాత రోజు ఆఫీస్ కి రఘు ఇంటర్వ్యూ ( interview ) కోసం వెళ్తాడు వైదేహి సహాయంతో రఘు కి జాబ్ వస్తుంది .


కొన్ని నెలలు గడిచాయి రఘు ఇంకా వైదేహి మంచి స్నేహితులు గా కలిసిపోయారు . ఒకరోజు రాత్రి వైదేహి, రఘు కి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైంది అని రఘు అడిగేలోపే వైదేహి ఫోన్ కట్ చేస్తుంది. 


రఘు , వైదేహి కి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ ( switched off) అని వస్తుంది.కాసేపటికి వైదేహి, రఘు కి ఫోన్ చేసి నాకు ఏం కాలేదు నేను బనేఉన్నాను , రేపు ఆఫీస్ లో మాట్లాడుతాను అని రఘు తో చెప్తుంది . రఘు కూడా సరే అని అంటాడు. 


తర్వాత రోజు ఆఫీస్ లో రఘు వైదేహి ని అడుగుతాడు " రాత్రి ఏమైంది ఎందుకు ఏడిచారు అని " . " మధ్యాహ్నం చెప్తాను ఇప్పుడు పని ఉంది కదా చేదాం" అని వైదేహి అంటుంది. 


మధ్యాహ్నం రఘు ఇంకా వైదేహి హోటల్ కి వెళ్తారు . హోటల్ లో రఘు మాట్లాడుతూ " ఎవరు అతను " అని అంటాడు.


" ఎవరు " అని వైదేహి అంటుంది . " రాత్రి మీరు ఫోన్ చేసి ఏడిచారు కదా ఎవరికోసం ఏడిచారు, ఎవరు అతను అని అడుగుతున్న" అని రఘు అంటాడు . 


" ఏం లేదు అమ్మ నాన్న గుర్తుకొచ్చారు " అని వైదేహి అంటుంది. " అమ్మ , నాన్న గుర్తు ఒస్తే ఇంటికి కాల్ చేస్తారు కానీ నాకు కాల్ చేసారు ఏంటి అని నా సందేహం. నేను మీ స్నేహితుడిని కదా చెప్పండి ఏం జరిగింది " అని రఘు అంటాడు . 


" నీకు ఎలా తెలుసు నేను ఎవరికోసమో ఏడుస్తున్నాను అని" వైదేహి అంటుంది .


" ఇప్పుడు మీకు ఏ సమస్య ( problem ) ఉంది చెప్పండి, మంచి జాబ్ ,జీతం సంతోషంగా చూసుకునే తల్లితండ్రులు ,మంచి స్నేహితులు ఇన్ని ఉన్నాయి ఐనా బాధపడి ఏడుస్తున్నారు అంటే మీరు ప్రేమించిన వారి కోసం ఏ కదా " అని రఘు అంటాడు. 


" అవును నువ్వు చెప్పింది నిజం నేను నా రామ్ కోసం ఏడిచాను " అని వైదేహి అంటుంది .


రామ్, నేను చిన్నప్పటినుండి కలిసి పెరిగాం ,చదువుకున్నం . రామ్ ఎప్పుడు నాకు తోడుగా , సహాయంగా ఉండేవాడు. రామ్ కి నేవీ ( navy ) ఆఫీసర్ అవ్వాలి అని తన కల . 


ఎంతో కష్టపడి చదివి చివరకు నేవీ లో చేరాడు. రోజు కాల్ చేసి మాట్లాడేవాడు కానీ ఒక నెల నుంచి రామ్ కాల్ చేయలేదు. నెల ముందు కాల్ చేసి ముఖ్యమైన పని ఉంది వెళ్తున్న ఒచ్చాక కాల్ చేస్తా అని చెప్పాడు ఇంకా కాల్ చేయలేదు . 


రాత్రి నేను రామ్ కి కాల్ చేశాను సమాధానం లేదు అప్పుడే నువ్వు గుర్తు ఒచ్చావ్ నీకు కాల్ చేసా ఏడవాలి అనిపించింది ఏడిచేసా .క్షమించు నిన్ను టెన్షన్ పెట్టాను.


నేను అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడాను నిన్ను చుసిన, నువ్వు చేసే పనులు చుసిన , నువ్వు నాపై చూపించే అభిమానం రామ్ ని గుర్తు చేస్తున్నాయ్" అని వైదేహి అంటుంది.


రఘు మాట్లాడుతూ " మీ ఇంట్లో చెప్పారా రామ్ ని ప్రేమిస్తున్న విషయం ". 


" చెప్పను రామ్ కుటుంబానికి ఇంకా మా కుటుంబానికి మేము పెళ్లి చేసుకోవడం ఇష్టమే " అని వైదేహి అంటుంది .


సరే మీరు ఏం బాధపడకండి ఏది జరిగిన మన మంచికే అని రఘు వైదేహి తో అంటాడు .


కొన్ని వారాల తర్వాత వైదేహి వాళ్ళ అమ్మ, నాన్న రామ్ వాళ్ళ తల్లితండ్రులను కలవడానికి ఒస్తారు.


వైదేహి రఘు కి కాల్ చేసి " నేను రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఊరు నుంచి అమ్మ,నాన్న ఒస్తున్నారు కలవడానికి నువ్వు కూడా రా మా అమ్మ,నాన్నలని పరిచయం చేస్తాను " అని వైదేహి అంటుంది .


" సరే వస్తాను అని రఘు చెప్తాడు" .


రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రామ్ వాళ్ళ నాన్నతో వైదేహి మాట్లాడుతూ " రామ్ ఎక్కడ ఉన్నాడు అంకుల్ కాల్ చేస్తే సమాధానం లేదు ఒక నెల అయిపోయింది రామ్ తో మాట్లాడి రామ్ కి కాల్ చేస్తా అని చెప్పి వైదేహి రామ్ కి కాల్ చేస్తుంది.


ఫోన్ రింగ్ అవుతుంది రామ్ ఫోన్ రఘు దగ్గర ఉంటుంది.అది చూసి వైదేహి ఆశ్చర్యపోతుంది . రఘు నీ దగ్గర రామ్ ఫోన్ ఉంది ఏంటి రామ్ కి ఏమైంది" అని అంటుంది వైదేహి.


అప్పుడు రామ్ వాళ్ళ నాన్న వైదేహి నీ , రామ్ రూమ్ కి తీసుకెళ్తారు అ రూమ్ లో రామ్ ఫోటో కి దండ వేసిఉంటుంది.

అది చూసి వైదేహి కళ్ళు తిరిగి పడిపోతుంది.


కాసేపటికి వైదేహి కి స్పృహ వస్తుంది .


రఘు ,వైదేహితో మాట్లాడుతూ " రామ్ నేను ఒకే బ్యాచ్ లో పనిచేసేవాళ్ళం . నాకు మంచి స్నేహితుడు . రామ్ మా బ్యాచ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. రామ్ ఎక్కువగా ఫోన్ లో మాట్లాడేవాడు . 


ఒకరోజు నేను అడిగా రామ్ ని ఎవరితో మాట్లాడతావ్ ఫోన్ లో అని అప్పుడు రామ్ మీ గురించి చెప్పాడు ,మిమల్ని ఎంతగా ప్రేమించాడో చెప్పాడు .మీరు రామ్ లైఫ్ లో ఉండడం తన అదృష్టం అని చెప్పాడు.


రామ్ కి మీరంటే ప్రాణం. మీ గురించి మాట్లాడే ప్రతిసారి ఏదో తెలియాని సంతోషం రామ్ లో కనిపించేది.


అ తర్వాత రోజు మత్తు పదార్దాలు ( drugs ) వ్యాపారం చేసేవాడు సముద్రం మధ్యలో వాళ్ళ సరుకు మారుతుంది అని తెలిసింది వాళ్ళనీ పట్టుకోడానికి మేము వెళ్ళాము అ గొడవలో రామ్ ఏమైపోయాడు తెలియదు, ఎంత వెతికిన దొరకలేదు. 


అ ముందురోజే రామ్ నాతో ఇలా చెప్పాడు " నాకు ఏదైనా జరిగితే వైదేహి బ్రతకాదు నేను ఉన్న లేకున్నా వైదేహి సంతోషంగా ఉండాలి రఘు.


ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నా జీవితం లో నేను నా విషయాలు ఎవరికి చెప్పుకొను కానీ నిన్ను చూస్తే నా సోదరుడిలాగా అనిపిస్తావ్ అందుకే నీకు నా విషయాలు చెప్పను అని రామ్ నాతో చెప్పాడు".


రామ్ కోసం నేను మీ దగ్గరికి ఒచ్చాను . మీరు హ్యాపీ గా ఉండాలి అని నా స్నేహితుడి కోరిక. మీరు ఏడిచేసరికి నాకు నిజం చెప్పక తప్పలేదు . మీ అమ్మ,నాన్నలతో మాట్లాడి రామ్ ఇంటికి మీరు ఒచ్చేలాగా చేసాను" అని రఘు వైదేహి కి జరిగిన విషయం చెప్తాడు.


అ తర్వాత వైదేహి సంతోషానికి దూరం అయిపోయింది , ఎప్పుడు రామ్ ని తలుచుకొని బాధపడుతూ ఉండేది అది చుసిన రఘు వైదేహి ని సంతోషంగా చూడడానికి, రామ్ ఇంకా వైదేహి వెళ్లిన ప్రతి చోటుకి వైదేహి నీ తీసుకెళ్తాడు అల అయినా రామ్ తో గడిపిన సంతోషమైన క్షణాలు గుర్తుచేసుకొని బాధని మరిచిపోతుంది అని రఘు అనుకుంటాడు.


రఘు చేసిన ప్రయత్నం వైదేహి ని కొద్దీ కొద్దీ గా మారుస్తుంది . వైదేహి కి రామ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి " నేను నీతో ఉన్న లేకున్నా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని " అప్పటి నుండి వైదేహి రామ్ కోసం సంతోషంగా ఉంటుంది .


కొన్ని రోజులు గడిచాయి వైదేహి వాళ్ళ అమ్మ,నాన్న వైదేహి తో రఘు ని పెళ్లిచేసుకోమని చెప్తారు దానికి వైదేహి ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది.అదే విషయం రఘు తో చెప్తారు. 


రఘు వైదేహి తో మాట్లాడుతూ " మీరు రామ్ ఆలోచనలనుండి ఇంకా బయటికి రాలేకపోతున్నారు అని అర్ధమవుతుంది కానీ మీ అమ్మ, నాన్నల కోసం ఈ పెళ్లి చేసుకుందాం మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో పెళ్లి తర్వాత అలానే ఉండండి .నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉంటాను మంచి స్నేహితులలాగా ఉందాం " అని రఘు వైదేహి నీ పెళ్ళికి ఓపిస్తాడు .


పెళ్లి రోజు పెళ్లి మండపం లో అనూహ్యంగా రామ్ ఒస్తాడు . రామ్ ని చూసి అందరు ఆశ్చర్యపోతారు . పెళ్లి పీఠాలపైనా రఘు ఇంకా వైదేహి ని చూసి రామ్ కోపం తో రఘు ని కొట్టడానికి వస్తాడు అది చూసి వైదేహి రామ్ ని అడ్డుకుంటుంది.


ఈ పెళ్లి ఎందుకు ఎలాంటి పరిస్థితిలో ఒపుకోవాల్సివచ్చిందో , రఘు మంచితనం ఏంటో వైదేహి రామ్ కి వివరిస్తుంది. 


రామ్ , రఘు ని కౌగిలించుకొని క్షమాపణ చెప్తాడు.

 

రఘు మాట్లాడుతూ " ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావ్ రామ్ నీకోసం చాల వెతికాం కానీ నిన్ను కనిపెట్టలేకపోయాం " అని అంటాడు .


" అ రోజు షిప్ ( ship ) లో మీరు అందరు బయట ఉన్నారు నేను లోపలి కి వెళ్ళాను నాకు ఇంకా అ గ్యాంగ్ లో వాడికి గొడవ జరిగింది అ గొడవ తర్వాత నన్ను వాళ్ళ స్థావరానికి వాళ్ళ మనుష్యుల సహాయంతో తీసుకెళ్లాడు . 


మన గురించి మన వివరాలు అడిగి నను హింసించారు నేను వాళ్ళకి ఏం చెప్పలేదు . ఒక రోజు నన్ను వేరే స్థావరానికి మారుస్తుండగా వాలని కొట్టి వాళ్ళనుండి తపించుకున్నాను.


అక్కడ ఉన్న అడివి మనుష్యుల సహాయంతో నేను బతికాను.అక్కడే ఇన్ని రోజులు ఉన్నాను. ఇక్కడికి ఒచ్చాక, వైదేహి హాస్టల్ దగ్గరికి వెళ్ళాను.


వెళ్ళాక తెలిసింది నీకు ఇంకా వైదేహి కి పెళ్లి అని అ మాట విని చాల కోపం ఒచ్చింది వెంటనే ఇక్కడికి ఒచ్చాను " అని రామ్ జరిగింది చెప్తాడు .


" వైదేహి గారి ప్రేమే నిన్ను కాపాడింది రామ్ అందుకే పెళ్లి టైం కి నువ్వు ఒచ్చావ్ చాల సంతోషంగా ఉంది. " అని రఘు అంటాడు.


అందరు కలిసి రామ్ ఇంకా వైదేహి పెళ్లి చేస్తారు .


రఘు ఒచ్చిన పని అయిపోయింది. రామ్ ఇంకా వైదేహి సంతోషంగా ఉన్నారు.రఘు తన పనికి వెళ్ళిపోయాడు.



Rate this content
Log in

Similar telugu story from Drama