STORYMIRROR

Dinakar Reddy

Abstract Action Inspirational

4  

Dinakar Reddy

Abstract Action Inspirational

వానా వానా వల్లప్పా

వానా వానా వల్లప్పా

1 min
661

ఆకృతీ! అదిగో వర్షం పడుతోంది. చూడు అంటూ ఆకృతికి కిటికీలోంచి బయట పడుతున్న వర్షపు నీటిని చూపించింది వనజ.


ఆకృతి గంతులేస్తోంది. చెప్పు నాన్నా ఇది అంటూ వనజ వానా వానా వల్లప్పా వాకిలి తిరుగు చెల్లప్పా అంది.


ఆకృతి కూడా వానా వానా వల్ల వల్ల అప్పా అంది.


వల్ల వల్ల అప్పా కాదు బుజ్జీ వల్లప్ప అను అంది వనజ. ఇప్పుడు ఈ పాటలు అవసరమా. మంచి ఇంగ్లీష్ poem చెప్పించు అన్నాడు వనజ భర్త.


ఆ స్కూల్లో ఎలాగూ ఇంగ్లీష్ నేర్పుతారు కదా. కూసింత తెలుగు నా కూతురికి నేర్పించుకోనివ్వండి మహాశయా అంది వనజ.


సరే మహారాణీ గారూ. ఆ అటక మీదున్న చిత్తు పేపర్లు తీసి కాగితపు పడవలు కూడా నేర్పించండి మీ ముద్దుల కూతురికి అన్నాడు వనజ భర్త.


మీకు చేయడం రాదు కదూ అంది వనజ. 

భార్యా భర్తలు ఇద్దరూ కలిసి చెరో కాగితపు పడవా చేసి ఆకృతికి ఇచ్చారు.


వాటిని తీసుకుని ఆకృతి వాకిటి తలుపు దగ్గరకు వెళ్ళింది.

ఆ రోజు ఎన్నో కాగితపు పడవలు వాళ్ళింటి ముందున్న వర్షపు నీటిలో తేలుతూ ఉన్నాయి.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract